ETV Bharat / sitara

'సాయిపల్లవి నెమలిలా నాట్యం చేస్తుంది'

హీరోయిన్​ సాయిపల్లవి డ్యాన్స్​ను నెమలి నాట్యంతో పోల్చారు ప్రముఖ కొరియోగ్రాఫర్​ శేఖర్​ మాస్టర్​. ఈ ముద్దుగుమ్మ చాలా మంచి డ్యాన్సర్​ అని కితాబిచ్చారు. దీంతోపాటే తన కెరీర్​ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

sekhar
శేఖర్​
author img

By

Published : Mar 1, 2021, 7:16 PM IST

ఏ కొరియోగ్రాఫర్‌కైనా తాము అనుకున్న స్టెప్పులు బాగా చేసే హీరోహీరోయిన్లు దొరికితే అంతకన్నా ఏం కోరుకోమని అంటున్నారు టాలీవుడ్‌ టాప్‌ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌మాస్టర్‌. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'లవ్‌స్టోరీ'. ఈ చిత్రం ఏప్రిల్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. పాట 'సారంగదరియా' విడుదలై ఉర్రూతలూగిస్తోంది. ఆ పాటకు సాయిపల్లవితో శేఖర్‌మాస్టర్‌ వేయించిన స్టెప్పులకు అందరూ ఫిదా అవుతున్నారు. ఈ పాటకు విశేష ఆదరణ దక్కింది. ఈ సందర్భంగా శేఖర్‌ మాస్టర్‌ మీడియాతో ముచ్చటించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఆమె ఏ చేసినా అందంగా ఉంటుంది

ఈ మూవీలో రెండు మెయిన్ సాంగ్స్, రెండు బిట్ సాంగ్స్ చేశాను. రెయిన్ పాట, సారంగ దరియా రెండు ప్రధాన పాటలు. సాయి పల్లవిని పెట్టుకుని బాగా చేయకపోతే తప్పు అవుతుంది. ఆమెలో మంచి గ్రేస్‌ ఉంది. ఆమె చాలా మంచి డ్యాన్సర్‌. ఏ మూమెంట్‌ చేసినా.. ఏ ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చినా కొరియోగ్రాఫర్‌ చూస్తూ ఉండిపోవాల్సిందే. ఒకసారి సాంగ్‌ కట్‌ చేసి.. తర్వాత ఎడిట్‌ రూమ్‌లోకి వెళ్లి చూస్తే ఈ అమ్మాయికంటే బాగా ఇంకెవరూ చేయలేరని అనిపిస్తుంది. ఆమె క్లాసికల్‌ డ్యాన్సర్‌ కావడంతో ఎక్స్‌ప్రెషన్స్‌ కూడా బాగా ఇవ్వగలుగుతుంది. ఆమె ఏం చేసినా అందంగా ఉంటుంది. 'ఢీ' ప్రోగ్రామ్‌ ద్వారా ఆమె నాకు ఇంకా బాగా దగ్గర అయింది. ఆమె ఢీ4లో పాల్గొంది. నేను వచ్చింది కూడా ‘ఢీ’ నుంచే.

సాయిపల్లవి నుంచి 'రాదు' అనే మాట రానేరాదు

కొరియోగ్రాఫర్స్‌ కొన్ని మూమెంట్స్‌ అనుకుంటారు. కరెక్ట్‌ హీరో చేస్తేనే కొరియోగ్రఫర్స్‌కు సంతృప్తి ఉంటుంది. అలాగే హీరోయిన్‌ విషయంలో కూడా అంతే. సాయిపల్లవి విషయానికి వస్తే.. ఫలానా మూమెంట్‌ చేయలేను అనే మాట ఆమె నుంచి రానేరాదు. సాయిపల్లవి లాంటి డ్యాన్సర్‌ దొరికితే కొరియోగ్రాఫర్‌కు పండగే.

డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల ముందే చెప్తారు

ఫిదాలో 'వచ్చిండే' సాంగ్‌ చేశాను. ఆ పాట చేసేప్పుడు ఏ అంచనాలు లేవు. కానీ.. ఈ పాటకు చాలా అంచనాలు ఉన్నాయి. కానీ మేము ఆ అంచనాలతో ఒత్తిడి పెట్టుకోలేదు. వచ్చిండే ఎలా చేశామో అలాగే చేశాం. అది సంగీత్‌లో చేసింది. 'సారంగదరియా' కూడా సంగీత్‌లో చేసిందే. డైరెక్టర్‌ శేఖర్‌కమ్ముల గారు ముందే మాకు చెప్తారు. ఈ పాట రెగ్యులర్‌ సాంగ్స్‌లా ఉండకూడదు. నేచురల్‌గా ఉండాలంటారు. పాట ఎంత నేచురల్‌గా ఉంటుందో డ్యాన్స్‌ కూడా అలాగే ఉండాలని చెప్తుంటారు. ఈ పాట మేం బాగా చేశామనేకంటే సాయిపల్లవి చేయడం వల్ల బాగా వచ్చిందనాలి.

ఈ పాట జనాల్లోకి బాగానే వెళుతుందని అనుకున్నాం. కానీ.. 24 గంటల్లోనే 60లక్షల మంది చూస్తారని.. ఇంత పెద్ద హిట్‌ అవుతుందని ఊహించలేదు.

అంచనాలను దృష్టిలో పెట్టుకొని పనిచేశాం

సాయిపల్లవితో 'వచ్చిండే', తర్వాత 'ఏమండోయ్‌ నానిగారు' చేశాను. ఆ తర్వాత 'రౌడీ బేబీ' ప్రభు మాస్టర్‌ చేశారు. అది ఇంకా పెద్ద హిట్‌ అయింది. ఆ పాటలన్నీ ఎంత పెద్ద హిట్లో అందరికీ తెలిసిందే. ఈ పాటలో సాయిపల్లవి ఉండటంతో అంచనాలు ఎక్కువయ్యాయి. అయితే.. మేం అవన్నీ దృష్టిలో పెట్టుకొని చేశాం. ఈ పాట మొత్తం మూడు రోజుల్లో పూర్తి చేశాం. సాయిపల్లవి కాబట్టి అంత త్వరగా పూర్తయింది.

మన పాటలకు యూట్యూబ్‌లో వీక్షణలు పెరుగుతున్న కొద్దీ టెన్షన్ పెరుగుతుందా అంటే ప్రేక్షకుల నుంచి వచ్చే ప్రశంసలు ఎవరికైనా ముఖ్యమే.

శేఖర్​ మాస్టర్​

శేఖర్‌కమ్ముల హీరోయిన్లను అందంగా చూపిస్తారు

సందర్భానుసారం పాటలు చేయడం శేఖర్ కమ్ముల గారి స్టైల్. కథానుసారం పాటలు వెళ్తుంటాయి. ఇతర దర్శకులతో పనిచేస్తున్నప్పుడు ఈయనతో చేయడం కొత్త అనుభవం. లిరిక్ ఆధారంగానే డాన్సులు కంపోజ్ చేస్తుంటాం. ఈ పాటలో 'కుడి భుజం మీద కడవ' అనే లిరిక్ ఉంటే కడవ పెట్టకుండానే.. ఉన్నట్లు డాన్సులు చేయించాం. శేఖర్ కమ్ముల గారికి హీరోయిన్లను చాలా అందంగా పద్ధతిగా చూపించడం ఇష్టం. మేమూ అదే ఫాలో అవుతుంటాం. సారంగదరియా ఇంత పెద్ద హిట్ అవడం నాకు ఆశ్చర్యంగానే ఉంది.

దాదాపు అన్ని పాటల్లోనూ లిరిక్స్‌కు ప్రాధాన్యత ఇచ్చి కొరియోగ్రఫీ చేస్తాం. అయితే.. కొన్ని సమయాల్లో అది సాధ్యం కాదు.

sekhar
శేఖర్​ మాస్టర్​

ఇలాంటి డ్యాన్సర్లుంటే ఇంకా బాగా చేయగలం

నేను 'ఖైదీ నెం.150', 'ఫిదా' రెండు సినిమాలు ఒకేసారి చేశాను. అయితే.. చిరంజీవిగారితో పనిచేసినందుకు ఎంత సంతోషం కలిగిందో.. ఫిదా చేసినందుకు కూడా అంతేస్థాయిలో ప్రశంసలు వచ్చాయి. ఫిల్మ్‌ఫేర్‌ కూడా ఈ రెండు పాటలకు కలిపి ఇచ్చారు. ఇలాంటి డ్యాన్సర్స్‌ దొరికితే మేం కూడా ఇంకా బాగా చేయగలుగుతాం.

సినిమా కథను డ్యాన్స్‌ డిస్టర్బ్‌ చేయకూడదు. డైరెక్టర్‌ శేఖర్‌ కమ్ముల కూడా అదే చెబుతుంటారు. ఒక పాటకు కొరియోగ్రఫీ చేసేటప్పుడు రెండు మూడు ప్రణాళికలు వేసుకుంటాం. ఒరిజినాలిటీ దెబ్బతినకుండా.. మరీ సినిమాటిక్‌గానూ ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. డ్యాన్స్‌ మూమెంట్స్‌లో అయితే డైరెక్టర్ల జోక్యం ఉండదు. కానీ.. ఫలానా స్టెప్పు అవసరం లేకున్నా బలవంతంగా చేయించారు అనిపించేలా ఉండకూడదని కొంతమంది డైరెక్టర్లు చెప్తుంటారు.

హీరోహీరోయిన్లు స్టెప్పు చేయలేకపోతే మనమే గుర్తించాలి

ఒకవేళ హీరోహీరోయిన్‌ ఏదైనా స్టెప్పు చేయలేకపోతే మనకే అర్థం అవుతుంది. వాళ్లు మాత్రం మనకు చెప్పరు. ప్రయత్నిస్తూనే ఉంటారు. అది గమనించి మనమే స్టెప్పు మార్చుకోవాల్సి ఉంటుంది.

ఇప్పటివరకైతే 'ఇక చాలు' అనిపించేలా సంతృప్తినిచ్చిన పాట రాలేదు. దానికోసమే నేనూ ప్రయత్నిస్తున్నా(నవ్వుతూ)

sekhar
శేఖర్​

ప్రస్తుతం దేవుడిచ్చిన డ్యాన్స్‌నే నమ్ముకున్నా

టీవీ షోల్లో కనిపించే వారిలో చాలామందికి అవకాశాలు వస్తాయి. నాకు కూడా వచ్చాయి. కానీ.. అది నా జాబ్‌ కాదు. ప్రస్తుతానికి దేవుడిచ్చిన డ్యాన్స్‌నే నమ్ముకొని ఉన్నాను. భవిష్యత్తులో చెప్పలేను. ఢీ, సినిమాలు, టీవీ షోలు.. ఉండటం వల్ల కొన్నిసార్లు డేట్స్‌ కుదరడం లేదు. మా బాబు కూడా సినిమాల్లో చేస్తున్నాడు. నేను పుష్ప, ఆచార్యతో పాటు మరికొన్ని చిత్రాలకు కొరియోగ్రఫీ చేస్తున్నాను.

సేమ్ శేఖర్ మాస్టర్, సాయి పల్లవి, శేఖర్ కమ్ముల గారు, ఆడవాళ్ల మధ్య పాట.. కాబట్టి 'వచ్చిండే' పాటతో ఈ పాటను పోలుస్తూ ఉంటారు. కానీ.. అలాంటి వాటికి తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నాం.

sekhar
శేఖర్​ మాస్టర్​

ఇదీ చూడండి: నాలుగు ప్రేమకథలు.. నలుగురు దర్శకులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.