ETV Bharat / sitara

సుశాంత్​ కేసును సీబీఐకి అప్పగించిన సుప్రీంకోర్టు

సుశాంత్​ మృతి కేసులో నటి రియా చక్రవర్తికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన కేసును పట్నా నుంచి ముంబయికి బదిలీ చేయాలన్న ఆమె అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు బుధవారం తుదితీర్పు వెలువరించింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయాలని పేర్కొంది అత్యున్నత న్యాయస్థానం. ఇప్పటివరకు ముంబయి పోలీసులు సేకరించిన ఆధారాలను సీబీఐ అధికారులకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది.

SC orders CBI probe in Sushant Singh Rajput's death case
సుశాంత్​ కేసును సీబీఐకి అప్పగించిన సుప్రీంకోర్టు
author img

By

Published : Aug 19, 2020, 11:19 AM IST

Updated : Aug 19, 2020, 12:38 PM IST

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ మృతిపై బిహార్​లో నమోదైన కేసు చట్టబద్ధమైనదని బుధవారం స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఈ కేసు విచారణకు సంబంధించి ఇప్పటివరకు సేకరించిన అన్ని ఆధారాలను సీబీఐ బృందానికి అప్పగించాలని ముంబయి పోలీసులకు సూచించింది.

సుశాంత్​ రాజ్​పుత్​ మృతిపై దాఖలైన కేసును పట్నా నుంచి ముంబయికి బదిలీ చేయాలని కోరుతూ.. నటి రియా చక్రవర్తి దాఖలు చేసిన పిటిషన్​పై సుప్రీం ఈ విధంగా తీర్పునిచ్చింది. ఈ కేసును బిహార్​ ప్రభుత్వం సీబీఐకి బదిలీ చేయడాన్ని సమర్థించింది అత్యున్నత న్యాయస్థానం.

సుప్రీంకోర్టు తీర్పు:

  1. పట్నాలో సుశాంత్​ మృతిపై నమోదు చేసిన ఎఫ్​ఐఆర్​ చట్టబద్ధమైనది. ఈ ఉత్తర్వులను సవాలు చేసే అవకాశం మహారాష్ట్ర ప్రభుత్వానికి లేదు.
  2. పట్నాలో నమోదైన కేసు మాత్రమే కాకుండా.. సుశాంత్​ కేసుకు సంబంధించిన మరే ఇతర ఎఫ్​ఐఆర్​లు నమోదైనా సీబీఐ మాత్రమే దర్యాప్తు చేస్తుంది.
  3. సుశాంత్​ మరణం వెనకున్న రహస్యాన్ని దర్యాప్తు చేసే ఏకైక అధికారం సీబీఐకి ఉంది. ఇందులో ఇతర రాష్ట్రాల పోలీసులు జోక్యం చేసుకోలేరు.
  4. సెక్షన్​ 174 సీఆర్​పీసీ ప్రకారం దర్యాప్తు చేస్తున్న ముంబయి పోలీసుల పరిధి పరిమితం. సుశాంత్ మరణాన్ని ప్రమాదవశాత్తు జరిగినట్లు ముంబయి పోలీసులు నమోదు చేసినందున, దీనికి పరిమిత దర్యాప్తు అధికారాలు మాత్రమే ఉన్నాయి.

తీర్పుపై స్పందన

సుశాంత్​సింగ్​ కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పుపై.. నటి అంకితా లోఖండే, సుశాంత్ తండ్రి తరపు న్యాయవాది వికాస్​ సింగ్​, హీరో సోదరి శ్వేతా సింగ్​తో సహా పలువురు హర్షం వ్యక్తం చేశారు.

"ఇది సుశాంత్​ కుటుంబం సాధించిన విజయం. సుప్రీంకోర్టు ప్రతి పాయింట్​ మా వాదనలకు మరింత బలం చేకూర్చింది. పట్నాలో నమోదైన కేసు చట్టబద్ధమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ కేసుకు సంబంధించి నమోదైన ఇతర ఎఫ్​ఐఆర్​లను కూడా సీబీఐ దర్యాప్తు చేస్తుందని సుప్రీం స్పష్టం చేసింది. మాకు తగిన న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఈ తీర్పుతో సుశాంత్​ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంది".

-వికాస్​ సింగ్​, సుశాంత్ తండ్రి తరపు న్యాయవాది

"నా కుటుంబానికి అభినందనలు! చాలా సంతోషంగా ఉంది. విజయం సాధించడానికి నిష్పాక్షిక దర్యాప్తు వైపు తొలి అడుగు ఇది".

- శ్వేతా సింగ్​ కీర్తి, సుశాంత్​ సోదరి

ఏం జరిగిందంటే?

సుశాంత్​ తండ్రి కేకే సింగ్ అభ్య‌ర్థ‌న మేర‌కు కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగించాలని కేంద్రాన్ని కోరింది బిహార్ ప్ర‌భుత్వం. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ.. బిహార్​ పోలీసులు సేకరించిన ఆధారాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతోంది. అందులో నటి రియా చక్రవర్తిని ప్రధాన నిందితురాలిగా చేర్చింది.

బిహార్​లో తనపై నమోదైన ఫిర్యాదు చట్టబద్ధంగా లేదని పేర్కొంటూ.. విచారణను ముంబయికి బదిలీ చేయాలని నటి రియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తులో సీబీఐ జోక్యం అవ‌స‌రం లేద‌ని కోరుతూ వ్యాజ్యం దాఖలు చేసింది. అయితే ఆమెకు ప్రతికూలంగా ఇవాళ తీర్పు వెలువరించింది సుప్రీం.

Last Updated : Aug 19, 2020, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.