ఎప్పుడూ వినూత్నంగా ఉండే సినిమాలు ఎంచుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నారు సత్యదేవ్. ఆయన హీరోగా, తమన్నా కథానాయికగా ఓ సినిమా తెరకెక్కుతోంది. దీనికి 'గుర్తుందా శీతాకాలం' అనే టైటిల్‌ను ఖరారు చేసింది చిత్రబృందం. నాగశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. భావన రవి మరో నిర్మాత. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతాన్ని అందిస్తున్నారు. దీనికి సంబంధించిన ఆడియోను ఆనంద్ ఆడియో సంస్థ రూ.75లక్షలకు సొంతం చేసుకుంది.
"సత్యదేవ్, తమన్నాలది క్రేజీ కాంబినేషన్. ఈ ప్రేమ కథకు పెట్టిన టైటిల్‌ను అందరూ క్రేజీగా భావిస్తున్నారు. చాలా ప్రేమ కథలు శీతాకాలంలోనే మొదలవుతాయి" అని దర్శకుడు నాగశేఖర్ చెప్పారు.
ఈ చిత్రం కన్నడ 'లవ్ మాక్‌టైల్'కు తెలుగు రీమేక్. మాతృకను కృష్ణ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మించారు. ఇందులో మిలనా నాగరాజ్, అమృత అయ్యంగర్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. సుమారు రూ.రెండు కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర రూ.ఐదు కోట్లు వసూలు చేసిందని సమాచారం. ఇందులో నటనకుగాను ప్రధాన పాత్రధారులకు మంచి పేరు వచ్చింది. మరి తెలుగులో తమన్నా - సత్యదేవ్ ఏ మేరకు ఆకట్టుకుంటారో చూడాలి. అతి త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్లు చిత్రబృందం వెల్లడించనుంది. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సత్యహెగ్డే.