ETV Bharat / sitara

Satyadev: దర్శకత్వం చేయాలనేది కోరిక.. కానీ!

నటుడిగా విభిన్న పాత్రలను వెండితెరపై పోషిస్తూ తనలోని నటుడ్ని సంతృప్తి పరుస్తున్నానని అంటున్నారు నటుడు సత్యదేవ్(Satyadev)​. ఇటీవలే 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రంతో కథానాయకుడిగా మంచి హిట్​ను సొంతం చేసుకున్న ఆయన ప్రస్తుతం అరడజనుకు పైగా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆదివారం (జులై 4) సత్యదేవ్​ పుట్టినరోజు(Satyadev Birthday) కారణంగా పత్యేకంగా ముచ్చటించారు.

Satyadev Kancharana Birthday Special Interview
Satyadev: దర్శకత్వం చేయాలనేది కోరిక.. కానీ!
author img

By

Published : Jul 4, 2021, 6:50 AM IST

"నా ప్రతి సినిమా విభిన్నంగా ఉండాలి. చేసే ప్రతి పాత్ర నటుడిగా నాకు సవాల్‌ విసరాలి. ఎప్పటికీ అలా వైవిధ్యభరితమైన కథలతోనే ప్రయాణం చేస్తా" అన్నారు నటుడు సత్యదేవ్‌. విలక్షణమైన నటనతో కథానాయకుడిగా.. సహాయ నటుడిగా విభిన్న పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు ఆయన. గతేడాది 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్రంతో విజయాన్ని అందుకొన్నారు. ప్రస్తుతం 'గుర్తుందా శీతాకాలం', 'గాడ్సే', 'తిమ్మరుసు' లాంటి అరడజనుకు పైగా చిత్రాలతో సెట్స్‌పై బిజీగా గడుపుతున్నారు. ఆదివారం సత్యదేవ్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా 'ఈనాడు సినిమా' ఆయన్ని పలకరించగా పలు ఆసక్తికర కబుర్లు పంచుకున్నారు.

ఈసారి పుట్టినరోజు ప్రత్యేకతలేంటి? కొత్త లక్ష్యాలేమైనా నిర్దేశించుకున్నారా?

"పుట్టినరోజును ఓ ప్రత్యేక వేడుకలా జరుపుకోవాలని నేనెప్పుడూ అనుకోను. కెరీర్‌ పరంగా గతేడాదికి.. ఈ ఏడాదికి మరింత పురోగతి సాధించాలనుకుంటా. నటుడిగా నన్ను నేను మరింత మెరుగు పరుచుకోవాలనుకుంటా. మూడేళ్లుగా ప్రతి బర్త్‌డేకి నా లక్ష్యాలు ఒకొక్కటిగా సాధించుకుంటూ వెళ్తున్నా. హీరోగా ఓ భారీ విజయాన్ని అందుకోవాలనుకున్నా. 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'తో నెరవేరింది. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాలనుకున్నా.. ఇప్పుడు 'రామ్‌ సేతు' సినిమాతో అది తీరనుంది. ఇలా ప్రతి పుట్టినరోజు నాటికి నేననుకున్న లక్ష్యాల్లో ఏదొకటి పూర్తి చేసుకుంటూ వెళ్తున్నా. ప్రస్తుతం ఐదు చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. ఆదివారం మరి కొన్ని కొత్త ప్రకటనలు వెలువడనున్నాయి".

ఈ మధ్య నానితో కలిసి 'దారే లేదు' పాట చేశారు. ఎలా అనిపించింది?

నాని అన్న అంటే నాకు చాలా ఇష్టం. తనతో కలిసి పనిచేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. ఓ రోజు ఆయనే ఫోన్‌ చేసి 'ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌ కోసం ఓ పాట చేయాలనుకుంటున్నా. నువ్వు చేస్తే బాగుంటుంద'న్నారు. నేను ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే చేస్తా అన్నా. ఎందుకంటే ఆయన అడుగుతున్నారంటే కచ్చితంగా అందులో ఏదో విషయం ఉంటుందని తెలుసు. నాకూ ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌ కోసం ఏదోకటి చేయాలని ఎప్పటి నుంచో మనసులో ఉంది. ఇవన్నీ 'దారే లేదు' పాట రూపంలో నెరవేరినందుకు సంతోషంగా అనిపించింది. మా పాటకు ప్రేక్షకుల నుంచి దక్కిన ఆదరణ చూశాక మరింత సంతృప్తిగా అనిపించింది.

ఏ నటుడైనా హీరో ఇమేజ్‌ వచ్చాక.. అలాగే కొనసాగాలి అనుకుంటారు. మీరిప్పటికీ అన్ని రకాల పాత్రలతో అలరించేందుకు ఇష్టపడుతున్నారు. ఎందుకిలా?

నిజానికి నా తొలి ప్రాధాన్యమెప్పుడూ లీడ్‌ రోల్స్‌పైనే ఉంటుంది. అయితే కొన్నిసార్లు కథలతో పాటు కొన్ని పాత్రలు మనలో ఓ తెలియని ఆసక్తి కలిగిస్తుంటాయి. ఒకవేళ అలాంటి విభిన్నమైన పాత్ర ఏదైనా నా దగ్గరకి వస్తే.. కచ్చితంగా చేయాలనే అనుకుంటా. ఓ ఇమేజ్‌ చట్రంలో బందీ అవ్వాలనుకోను. నేను ఏం చేసినా కొత్తగా ఉండాలనుకుంటా. చేసే ప్రతి సినిమా మునుపటి చిత్రానికి భిన్నంగా ఉండాలనుకుంటా.

తమన్నాతో కలిసి 'గుర్తుందా శీతాకాలం' సినిమా చేస్తున్నారు. ఆ చిత్ర విశేషాలేంటి?

తమన్నా పాన్‌ ఇండియా నటి. ఆమెతో కలిసి పని చేయడం నాకే కాదు.. మా బృందానికీ ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే నేను నటుడిగా అరంగేట్రం చేయడానికి ముందు నుంచే ఆమె పెద్ద స్టార్‌. ఈ రోజున ఆమెతో కలిసి తెర పంచుకుంటున్నానంటే.. ఏదో సాధించానన్న గొప్ప సంతృప్తి కలుగుతోంది. చక్కటి ప్రేమకథతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో తమన్నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. ఆమె ఇప్పటి వరకు చేయని విభిన్న పాత్రను ఇందులో పోషిస్తోంది. అలాగే నా పాత్ర సరికొత్తగా అనిపిస్తుంది. మూడు భిన్నమైన గెటప్పుల్లో కనిపిస్తా. ప్రస్తుతం తుది షెడ్యూల్‌ చిత్రీకరణ జరుగుతోంది. మరో పదిరోజుల్లో చిత్రీకరణ పూర్తవుతుంది.

'గాడ్‌ సే', 'తిమ్మరుసు', 'స్కైలాబ్‌' సినిమాలు ఎంత వరకు వచ్చాయి? కొత్త కథలు ఏమైనా ఒప్పుకొన్నారా?

'తిమ్మరుసు' చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. 'గాడ్సే' తుది దశ చిత్రీకరణలో ఉంది. మరో 15రోజులు చిత్రీకరణ జరిపితే సినిమా పూర్తవుతుంది. 'స్కైలాబ్‌' షూటింగ్‌ పూర్తి చేసుకుంది. దీన్ని సింక్‌ సౌండ్‌ విధానంలో తెరకెక్కించారు. కాబట్టి ఇక ప్రత్యేకంగా డబ్బింగ్‌ చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలన్నీ దాదాపు ఈ ఏడాదిలోనే రానున్నాయి. 'రామ్‌ సేతు' త్వరలో సెట్స్‌పైకి వెళ్తుంది. మరికొన్ని కథలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలో వాటివివరాలు అధికారికంగా ప్రకటిస్తా.

దర్శకత్వం చేస్తా..

దర్శకత్వం చేయాలన్న కోరిక ఉంది. అయితే అది ఇప్పుడే కాదు. ముందు నాలోని నటుడ్ని సంతృప్తి పరచాలి. ఆ తర్వాతే మెగాఫోన్‌పై దృష్టి పెడతా. నాకు తెలిసి మరో 15 ఏళ్ల తర్వాత డైరెక్షన్‌ చేస్తాననుకుంటున్నా. ఇందుకోసమే అప్పుడప్పుడు నాకొచ్చిన ఆలోచనల్ని పేపర్‌పై పెడుతున్నా.

ఇదీ చూడండి.. HBD Keeravani: పాటల తోటమాలి.. సంగీత 'బాహుబలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.