లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన సినీ సెలబ్రిటీలు.. తమ భవిష్యత్ ప్రాజెక్టుల విషయంలో జోరు చూపిస్తున్నారు. ఈ విరామ సమయంలో చక్కగా కథలు వింటూ ఆసక్తికరమైన ప్రాజెక్టులకు పచ్చజెండాలు ఊపేస్తున్నారు. యువ కథానాయకుడు శర్వానంద్ కూడా ఇదే పనిలో ఉన్నాడు.
ఇప్పటికే శర్వా నుంచి 'శ్రీకారం' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా.. అజయ్ భూపతితో చేయాల్సిన 'మహా సముద్రం' సెట్స్‌పైకి వెళ్లేందుకు రెడీగా ఉంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలోనూ ఓ సినిమా పట్టాలెక్కించనున్నాడు.
అయితే తాజాగా ఈ జాబితాలోకి మరో సినిమా వచ్చి చేరబోతుందని సమాచారం. అది ఓ కొత్త దర్శకుడితో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో రానుంది. అంతేకాదు ఇది రామ్‌చరణ్ హీరోగా నటించాల్సిన కథ అని టాక్. చరణ్, శర్వాల స్నేహితుడైన శ్రీరామ్ రెడ్డి అనే వ్యక్తి ఈ కథను సిద్ధం చేసినట్లు సమాచారం.
ఇదీ చూడండి : బన్నీ పాటను.. మహేశ్ పాడేశారు!