సూపర్‌స్టార్ మహేశ్‌బాబు బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపాడు. తన స్టామినా ఏంటో చూపించాడు. శనివారం వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' అన్నిచోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకొని, అలరిస్తోంది. ఈ సందర్భంగా తొలిరోజు అదిరిపోయే వసూళ్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.46.77 కోట్లు రాబట్టింది. ఈ విషయాన్ని నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర ట్విట్టర్లో వెల్లడించారు.
ఈ చిత్రంలో మహేశ్.. ఆర్మీ మేజర్‌గా నటించాడు. రష్మిక హీరోయిన్. విజయశాంతి, ప్రకాశ్‌రాజ్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. అనిల్ సుంకర-దిల్‌రాజు-మహేశ్‌బాబు సంయుక్తంగా నిర్మించారు.
ఇవీ చదవండి: