ఇప్పటి వరకు ప్రేమ కథల్లో అందాల నాయికగా అల్లరి చేసిన సారా అలీఖాన్.. ఇప్పుడు తొలిసారి ఓ సినిమా కోసం సాహసాలు చేయనుంది. స్టార్ హీరోలకు దీటుగా యాక్షన్ హంగామా రుచి చూపించేందుకు సిద్ధమవుతోంది.
సారా ప్రస్తుతం విక్కీ కౌశల్‌కు జోడీగా 'ది ఇమ్మోర్టల్ అశ్వథ్థామ' సినిమాలో నటిస్తోంది. మహాభారతంలోని అశ్వథ్థామ పాత్రని ఆధారంగా చేసుకొని ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రంగా రూపొందిస్తున్నారు. ఇందులో సారా పాత్రకీ భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయట. అందుకే ఈ పాత్ర కోసం విక్కీతో కలిసి కొన్ని నెలలుగా తెగ కసరత్తులు చేస్తోందట.
గుర్రపు స్వారీతో పాటు విలువిద్య నేర్చుకుంటోందట సారా. ఈ సినిమా చిత్రీకరణ సెప్టెంబరు నుంచి ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఐదు నెలల నిడివి గల భారీ షెడ్యూల్‌ని ప్లాన్ చేశారు. భారత్‌తో పాటు అమెరికా, ఐస్లాండ్లలో షూట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2023లో విడుదల చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రాన్ని రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్నారు.
ఇదీ చూడండి: మహేష్, పవన్‌తో పాటు రేసులో నిలిచేదెవరు?