ETV Bharat / sitara

'అదే నన్ను క్యాన్సర్​ను జయించేలా చేసింది' - సంజయ్ దత్ క్యాన్సర్

క్యాన్సర్​ను జయించడంపై స్పందించాడు బాలీవుడ్ నటుడు సంజయ్ దత్. పాజిటివ్ దృక్పథంతో ఆలోచించడం వల్లే ఇది సాధ్యమైందని వెల్లడించాడు.

Sanjay Dutt
సంజయ్ దత్
author img

By

Published : Feb 8, 2021, 10:58 AM IST

ఊపిరితిత్తుల క్యాన్సర్​తో తాను బాధపడుతున్నట్లు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ గతేడాది వెల్లడించాడు. లాక్​డౌన్ తర్వాత చికిత్స కోసం విదేశాలకూ వెళ్తున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలోనే సినిమాలకు కొన్ని నెలలు విరామం తీసుకుంటున్నట్లు తెలిపాడు. అయితే అదే ఏడాది అక్టోబరులో క్యాన్సర్​ను జయించానని ఆయన ప్రకటించడం విశేషం. తాజాగా ఈ విషయమై స్పందించాడు సంజయ్. ఆ సమయంలో డాక్టర్లు తనకు బతికే అవకాశం 50-50 శాతం ఉందని అన్నట్లు వెల్లడించాడు.

"ఆ వార్త తెలిసినపుడు నాకు ఈ వ్యాధి నాకే ఎందుకు వచ్చిందని చాలా కోపం వచ్చింది. మిగత వారు ట్రీట్​మెంట్ ఎలా తీసుకోవాలా అని ఆలోచించడానికి చాలా సమయం తీసుకుంటారు. కానీ నాకు అంత సమయం లేదు. అందుకే క్యాన్సర్​పై పోరడానికి సిద్ధమయ్యా. డాక్టర్ సెవంతి లిమయే నాకు బతికే అవకాశం 50-50 శాతం ఉన్నట్లు తెలిపారు. 50 శాతం పాజిటివ్​ కోణంలోనే ఆలోచించమని చెప్పారు. ఆ మాట నాలో చాలా ధైర్యాన్ని నింపింది. ప్రతి విషయంలోనూ ఓ వెలుగు కోణం ఉంటుందని అర్థమైంది."

-సంజయ్ దత్, నటుడు

యశ్ హీరోగా నటిస్తోన్న 'కేజీఎఫ్ 2'లో సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే తన పాత్రకు షూటింగ్ పూర్తి చేసుకున్నాడు సంజూ. ఈ చిత్రం జులై 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.