ETV Bharat / sitara

సహకరిస్తే సరి.. లేదంటే మరో పదిరోజులు నిర్బంధమే!

కన్నడ కథానాయికలు సంజన, రాగిణిల డ్రగ్స్ పరీక్షల ఫలితాలను సోమవారం వెల్లడించనున్నారు. వారు మాదకద్రవ్యాలు తీసుకున్నట్లు తేలితే వారి చుట్టు ఉచ్చు మరింత బిగుసుకునే అవకాశముంది. మరో 20 మంది నటీనటులకు టెస్ట్​లు చేసేందుకు సిద్ధమవుతోంది సీసీబీ.

sandalwood drug case
కన్నడ హీరోయిన్లు
author img

By

Published : Sep 14, 2020, 10:31 AM IST

మాదక ద్రవ్యాల వినియోగం, విక్రయం ఆరోపణలు ఎదుర్కొంటున్న కన్నడ హీరోయిన్లు సంజన గల్రానీ, రాగిణి ద్వివేదిల విచారణను మడివాళ సమీపంలోని ఫోరెన్సిక్‌ ప్రయోగశాలలో ఆదివారం రాత్రి వరకు మూడు విడతల్లో కొనసాగించారు. సహకరించకపోతే మరో పది రోజులు నిర్బంధం (కస్టడీ)లోకి తీసుకుంటామని సీసీబీ అధికారిణి అంజుమాల స్పష్టం చేయడం వల్ల కొన్ని ప్రశ్నలకు బదులిచ్చారు. సోమవారంతో వీరిద్దరి పోలీసు కస్టడీ గడువు పూర్తి కానుంది. కాటన్‌పేట ఠాణాలో నమోదైన కేసులో నేటికీ ఎనిమిది మంది నిందితులు పరారీలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సంజన, రాగిణికి జామీను మంజూరు చేయవద్దని, తమ విచారణకు మరోసారి అవకాశం కల్పించాలని నార్కోటిక్‌ విభాగం పోలీసులు కోరనున్నారు. రాగిణి వేసుకున్న జామీను అర్జీ నేటికి వాయిదా పడింది. సంజన కొత్తగా నేడు జామీను అర్జీ వేసుకునే అవకాశం ఉంది. పోలీసుల విచారణకు అవకాశం ఇవ్వకుండా, జామీను మంజూరు చేయకపోతే వీరిద్దరూ పరప్పన అగ్రహార కారాగారానికి వెళ్లవలసి ఉంటుంది. ఇదే కేసులో అరెస్టయిన నిందితులను వివిధ ప్రాంతాల్లో విడివిడిగా, కొందరిని ఏకకాలంలో విచారణ చేశారు.

శ్రీలంకలో క్యాసినోకు విచ్చేయండి

జూదం, క్యాసినోలకు రావాలని, క్లబ్‌లలో విందులకు హాజరు కావాలంటూ ప్రజాదరణ పొందిన నటీనటులు అంతర్జాలంలో, ఫేస్‌బుక్‌లో, టీవీల్లో ప్రకటనలు ఇస్తుంటారు. శ్రీలంకలో నిర్వహించే క్యాసినో పార్టీలకు హాజరు కావాలని పలువురు నటీనటులు ఇలా ప్రకటనలు ఇచ్చినట్లు విచారణ అధికారులు గుర్తించారు. కన్నడ నటి ఐంద్రితా, తెలుగు, తమిళం, హిందీ తదితర భాషా చిత్రాల్లో నటించిన తాప్సి పన్ను, కాజల్‌ అగర్వాల్‌, బాలీవుడ్‌ కథానాయికలు బిపాసా బసు, ఊర్వశి రౌటేలా, జాక్వలిన్‌ ఫెర్నాండెజ్‌, నటుడు సోనూసూద్‌ తదితరులు ఈ తరహా ప్రకటనల్లో కనిపించారు. కొన్ని క్యాసినో యాజమాన్యాలు, ప్రకటన సంస్థల నుంచి వచ్చిన ఆఫర్లతోనే వీరు ఈ ప్రచార చిత్రాల్లో నటించి ఉంటారని అనుమానిస్తున్నారు. కొన్ని క్యాసినో పార్టీలకు బాలీవుడ్‌తో పాటు, అన్ని భాషల చలనచిత్రాల నటీనటులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారని ఇప్పటికే కొన్ని వీడియో ఫుటేజ్‌ల ద్వారా పోలీసులు గుర్తించారు. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసులో అరెస్టయిన నటి రియా చక్రవర్తికి శాండల్​వుడ్​కు చెందిన కొందరు కథానాయికలతో సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. పూర్తి ఆధారాలతో విచారణ జరిపేందుకు సీసీబీ, నార్కోటిక్‌, ఈడీ, ఐటీ శాఖల అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

ఐఏఎస్‌ అధికారితో చర్చలు

డ్రగ్స్‌ కేసులో రాగిణి ద్వివేది అరెస్టయిన తరువాత మరో నటి సంజన గల్రాని ఒక సీనియరు ఐఏఎస్‌ అధికారితో పలుసార్లు మాట్లాడినట్లు విచారణలో గుర్తించారు. తనను రక్షించాలని ఆ అధికారితో పాటు, మరికొందరితో ఆమె మాట్లాడిందని చెప్పారు. తన నివాసంలో సోదాలు వద్దని, అరెస్టు చేయకుండా కాపాడాలంటూ కోరినట్లు కాల్‌ డేటా ఆధారంగా గుర్తించారు. ఆ అధికారికి చెందిన కొన్ని బ్యాంకు చెక్కులు సంజన నివాసంలో లభించాయి. విచారణలో ఇప్పటి వరకు గుర్తించిన అంశాలు, రాజకీయ నాయకులు, నటుల పేర్లను సీల్డ్‌ కవర్‌లో ఉంచి, న్యాయస్థానానికి అందిస్తామని అదనపు పోలీసు కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ తెలిపారు. అనారోగ్యం, ఇతర సమస్యలను పేర్కొంటూ మొదట్లో విచారణకు సహకరించని కథానాయికలు ఇప్పుడు తమ ప్రశ్నలకు స్పందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

నేడు నివేదిక: మాదక ద్రవ్యాలు, ఉత్ప్రేరకాలను వినియోగించిన వారిని గుర్తించేందుకు సాధారణంగా డోప్‌ పరీక్షలు నిర్వహిస్తారు. మూత్రం, శిరోజాలు, చెమట, లాలాజలం తదితరాలను ఉపయోగించి, గత 92 రోజుల్లో వారు ఏవైనా మాదక ద్రవ్యాలను తీసుకున్నారో, లేదో గుర్తించేందుకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించే సదుపాయాలు మడివాళలోని ఫోరెన్సిక్‌ ప్రయోగశాలలో సదుపాయాలు ఉన్నాయి. రాగిణి, సంజన నుంచి సేకరించిన నమూనాల పరీక్ష నివేదిక సోమవారం సాయంత్రం లోగా పోలీసుల చేతికి అందనుంది. ఈ నివేదికలో పాజిటివ్‌ వస్తే కథానాయికలు ఇద్దరికీ ఉచ్చు మరింత బిగిసే అవకాశం ఉంది. పరారీలో ఉన్న నిందితుడు నియాజ్‌ అహ్మద్‌, ఇప్పటికే అరెస్టయిన రాహుల్‌ శెట్టితో సంజన పలుసార్లు వాట్సాప్‌ ఛాటింగ్‌లు చేసినట్లు గుర్తించారు. మాదక ద్రవ్యాలతో పాటు అక్రమంగా నగదు, మానవ తరలింపు (హవాలా) తదితర నేరాలతో ఆమెకు సంబంధం ఉందని అనుమానిస్తున్నారు. ఈ ఆరోపణలు రుజువైతే ఆమె పెనం పైనుంచి పొయ్యిలో పడినట్లే.

గాలింపు తీవ్రం

మాదక ద్రవ్యాలు వినియోగించిన కేసులో ప్రధాన నిందితుడు (ఎ-1) శివప్రసాద్‌, ఆరో నిందితుడు ఆదిత్య ఆళ్వా, మరికొందరు ఇప్పటికీ పరారీలో ఉన్నారు. వారితో పాటే పరారీలో ఉన్న ఇతర నిందితుల కోసం మహారాష్ట్ర, గోవా, హైదరాబాద్‌, చెన్నై, కేరళ తదితర ప్రాంతాలకు పోలీసులు వెళ్లారు. పోలీసుల అదుపులో ఉన్న రవిశంకర్‌, వీరేన్‌ ఖన్నా, ప్రతీక్‌ శెట్టిలకు ప్రభుత్వ వైద్యశాలల్లో ఆదివారం వైద్య పరీక్షలు చేయించారు. ఆభరణాల వ్యాపారి కుమారుడు వైభవ్‌ జైన్‌ను ప్రత్యేకంగా విచారణ చేస్తున్నారు. డ్రగ్స్‌ను వినియోగించిన వారిలో 20 మంది నటీనటులు ఉన్నట్లు ఇప్పటికే సాంకేతిక నిపుణుల సహకారంతో రాబట్టిన వాట్సాప్‌ ఛాట్‌, ఈ-మెయిళ్ల ద్వారా గుర్తించారు. విచారణ సమయంలోనూ కథానాయికలు కొందరు పేర్లు చెప్పినప్పటికీ దానికి సంబంధించిన ఆధారాలను వారు వెల్లడించలేదని సమాచారం. తాము కారాగారానికి వెళతామన్న భయంతో, కొందరి ప్రముఖుల పేర్లు చెప్పి ఉంటారని అనుమానిస్తున్నారు. వీరేన్‌ ఖన్నా నిర్వహించిన పార్టీల్లో రాజకీయ నాయకులు, వ్యాపారులు, శ్రీమంతులు, క్రికెట్‌ ఆటగాళ్లు ఉన్నట్లు గుర్తించారు. తాను ఇచ్చిన పార్టీకి రాగిణి రెండుసార్లు మాత్రమే హాజరైందని, సంజన పలుసార్లు వచ్చిందని విచారణలో వీరేన్‌ ఖన్నా వెల్లడించాడని సమాచారం.

ఇద్దరికీ నోటీసులు

చామరాజపేట ఎమ్మెల్యే జమీర్‌ అహ్మద్‌ ఖాన్‌ మాదక ద్రవ్యాలు వినియోగించే క్లబ్బులు, క్యాసినోలకు వెళ్లి వచ్చేవారని సామాజిక కార్యకర్త ప్రశాంత్‌ సంబరిగి ఆరోపించారు. దీనిపై తాను ప్రశాంత్‌పై పరువు నష్టం దావా వేస్తానని జమీర్‌ తెలిపారు. ఈ నేపథ్యంలో తమ ముందు శుక్రవారం మరోసారి విచారణకు హాజరు కావాలని ప్రశాంత్‌కు నోటీసులు జారీ చేసినట్లు పశ్చిమ వలయం డీసీపీ డా.సంజీవ్‌ చెప్పారు. జమీర్‌కూ నోటీసులు జారీ చేసి విచారణ చేస్తామన్నారు.

అపార్ట్‌మెంట్లలో పార్టీలు-వాట్సాప్‌ గ్రూపులు

మాదక ద్రవ్యాలను వినియోగించే శ్రీమంతులు, రాజకీయ నాయకుల సంతానం, నటీనటులు ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేసుకున్నట్లు విచారణలో గుర్తించారు. ఒక్కో చోట 30 నుంచి 50 మంది విందు చేసుకునేవారు. పార్టీలు చేసుకునే అపార్ట్‌మెంట్ల వద్దకు కొందరు నిందితులను పంచనామా నిమిత్తం ఆదివారం తోడ్కొని వెళ్లారు. తమ ఫోన్ల నుంచి సందేశాలు, వాట్సప్‌ యాప్‌ను తొలగించిన సంజన, రాగిణిలపై ఐపీఎస్‌ సెక్షన్‌ 201 (సాక్ష్యాలను నాశనం చేయడం) కింద కొత్తగా కేసు నమోదు చేశారు. హుబ్బళ్లికి చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు గిరీశ్‌ గదిగప్ప నిత్యం రాగిణితో ఛాటింగ్‌ చేసేవాడు. ఈ నేపథ్యంలో అక్కడి పోలీసులు ఆయన్ను ఆదివారం అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.