ETV Bharat / sitara

సమంత భయపడుతోంది.. అలా చేయొద్దు: బాలీవుడ్ స్టార్ - సమంత

Samantha Varun Dhawan: సమంత భయపడుతోంది.. ఆమెను ఎందుకు భయపెడుతున్నారంటూ మీడియాను అడిగారు బాలీవుడ్ హీరో వరుణ్​ ధావన్​. ముంబయిలో ఉన్న దర్శకులు రాజ్‌ అండ్‌ డీకేలను ఆమె ఇటీవలే కలిశారు. ఈ సందర్భంగా ఫొటోల కోసం ఫొటోగ్రాఫర్లు, అభిమానులు చుట్టుముట్టుడం వల్ల ఈ మేరకు సామ్​కు రక్షణగా నిలబడ్డారు వరుణ్.

Samantha
Samantha Varun Dhawan
author img

By

Published : Mar 12, 2022, 4:10 PM IST

Samantha Varun Dhawan: విడాకుల అనంతరం సినిమాల విషయంలో స్పీడ్‌ పెంచారు అగ్రకథానాయిక సమంత. దక్షిణాదితోపాటు బాలీవుడ్‌ ప్రాజెక్ట్‌లకూ ఆమె పచ్చజెండా ఊపేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ఆమె ఎక్కువగా ముంబయిలో దర్శనమిస్తున్నారు. భవిష్యత్తు ప్రాజెక్ట్‌లకు సంబంధించి పలువురు దర్శకులతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం దర్శకులు రాజ్‌ అండ్‌ డీకేలను సమంత కలిశారు. 'ఫ్యామిలీమేన్‌-2' సిరీస్‌తో తనకు మంచి గుర్తింపు ఇచ్చిన వీరిద్దరిని కలిసి మాట్లాడారు. అయితే ఈ మీటింగ్‌లో సమంతతోపాటు బాలీవుడ్‌ వరుణ్‌ ధావన్‌ కూడా పాల్గొన్నారు.

Samantha Varun Dhawan
సమంత-వరుణ్‌

అనంతరం సమంత-వరుణ్‌ ధావన్‌ బయటకు రాగానే ఫొటోగ్రాఫర్లు, అభిమానులు వారిని చుట్టుముట్టారు. ఫొటోలు తీసుకునేందుకు ఎగబడ్డారు. "సమంత.. సమంత.." అంటూ కేకలు వేశారు.

Samantha Varun Dhawan
సమంత-వరుణ్‌ ధావన్‌

దీంతో అక్కడే ఉన్న వరుణ్‌.. "సమంత భయపడిపోతుంది.. ఆమెను ఎందుకు భయపెడుతున్నారు" అంటూ ఆమెను అక్కడి నుంచి తీసుకువెళ్లి కారు ఎక్కించారు.

Samantha Varun Dhawan
వరుణ్​-సామ్

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అది చూసిన నెటిజన్లు.. "వరుణ్‌-సమంత కలిసి సినిమా చేస్తున్నారా?", "రాజ్‌ డీకేలతో వీళ్లిద్దరూ కొత్త సిరీస్‌ చేస్తున్నారా?" అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇదీ చూడండి: అవార్డ్స్​ ఫంక్షన్​లో సమంత బోల్డ్​ షో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.