ETV Bharat / sitara

సెట్లోకి 'శాకుంతలం'.. హైదరాబాద్​లో 'థ్యాంక్యూ' - సమంత శాకుంతలం

హీరోయిన్​ సమంత(Samantha) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 'శాకుంతలం' రెండో షెడ్యూల్‌ షూటింగ్​ హైదరాబాద్‌లో మొదలైంది. గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. అలాగే విక్రమ్. కె. కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న 'థ్యాంక్యూ' చిత్ర షూటింగ్​ ఈ వారమే ప్రారంభంకానుంది.

Samantha Shakuntalam
సెట్లోకి శాకుంతలం
author img

By

Published : Jun 29, 2021, 9:13 AM IST

రెండో దశ కరోనాతో ఆగిపోయిన సినిమాలు ఒకొక్కటిగా మళ్లీ సెట్స్‌పైకి వెళుతున్నాయి. గతేడాది తరహాలోనే కొవిడ్‌ జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణను పునః ప్రారంభిస్తున్నారు. చిత్రీకరణలు మొదలు కావడం వల్ల సినీ పరిశ్రమలో సందడి నెలకొంది. సమంత(Samantha) ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న 'శాకుంతలం' రెండో షెడ్యూల్‌ చిత్రీకరణ హైదరాబాద్‌లో మొదలైంది. లాక్‌డౌన్‌ సమయంలోనే ఈ షెడ్యూల్‌ కోసం ప్రత్యేకంగా ఓ భారీ సెట్స్‌ను తీర్చిదిద్దారు. ప్రస్తుతం అందులోనే చిత్రీకరణ చేస్తున్నారు. గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. నీలిమ గుణ నిర్మిస్తున్నారు. దిల్‌రాజు సమర్పకులు. సమంతతోపాటు దేవ్‌ మోహన్‌ ముఖ్యభూమిక పోషిస్తున్న ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది.

ఐదు రోజులే

'థ్యాంక్యూ' చిత్రాన్ని ముగించేందుకు కథానాయకుడు నాగచైతన్య(Naga Chaitanya) సిద్ధమవుతున్నారు. ఇందుకోసం జులై తొలి వారంలోనే తిరిగి సెట్స్​లోకి అడుగుపెట్టనున్నారని సమాచారం. విక్రమ్. కె. కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రమిది. కొత్తదనం నిండిన ఓ వైవిధ్య భరిత కథాంశంతో రూపొందుతోంది. రాశీ ఖన్నా, అవికాగోర్​, మాళవిక నాయర్ కథానాయికలు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. కరోనా ఉద్ధృతిలోనే ధైర్యంగా ఇటలీలో కీలక షెడ్యూల్ పూర్తి చేసిన చిత్రబృందం.. ఇప్పుడు హైదరాబాద్​లో ఆఖరి షెడ్యూల్​ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఈ వారాంతంలోనే ఈ షూట్ మొదలు కానుంది. ప్రస్తుతం మరో ఐదు రోజుల చిత్రీకరణే మిగిలి ఉందని.. ఇందులో భాగంగా చైతూతో పాటు మిగిలిన ప్రధాన తారాగణం పై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారని సమాచారం. సినిమా విడుదలపై ఆగస్టులో స్పష్టత వచ్చేఅవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి పీసీ శ్రీరామ్ కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇదీ చూడండి: షారుక్​ కొత్త చిత్రం.. 'అంతిమ్' షూటింగ్​లో సల్మాన్​!​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.