ETV Bharat / sitara

'శాకుంతలం' షురూ- 'పుష్పక విమానం' పాట​ రిలీజ్​ - చేరువైన దూరమైన టీజర్​

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చేశాయి. హీరోయిన్​ సమంత ప్రధాన పాత్రలో రానున్న 'శాకుంతలం' సినిమా షూటింగ్​ ప్రారంభమైంది. హీరో ఆనంద్​ దేవరకొండ నటిస్తున్న 'పుష్పక విమానం' సినిమాలోని తొలి పాట విడుదలైంది.

puspaka
పుష్పక
author img

By

Published : Mar 15, 2021, 1:05 PM IST

హీరోయిన్​ సమంత ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్న సరికొత్త చిత్రం 'శాకుంతలం'. సోమవారం ఈ సినిమా షూటింగ్​ లాంఛనంగా ప్రారంభమైంది. దీనికి సంబంధించిన ఫొటోలను పోస్ట్​ చేసింది చిత్రబృందం. మహాభారతంలోని ఆదిపర్వంలో శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో సమంత.. శకుంతల పాత్ర పోషించగా.. మలయాళ నటుడు దేవ్​ మోహన్​ దుష్యంత్​ పాత్రలో కనిపించనున్నారు.

సుజిత్​ రెడ్డి, తరుణిక సింగ్​ జంటగా తెరకెక్కుతున్న సినిమా 'చేరువైన.. దూరమైన'. కె.ఎస్​.ఎన్​.చందు దర్శకత్వం వహిస్తున్నారు. ఇవాళ విడుదలైన ఈ సినిమా టీజర్​ ఆకట్టుకుంటోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

విజయ్ దేవరకొండ సమర్పణలో హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న చిత్రం 'పుష్పక విమానం'. తాజాగా ఈ సినిమాలోని 'చిలకా' లిరికల్​ వీడియో సాంగ్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్రంలో సునీల్ కీలకపాత్ర పోషిస్తున్నారు. డార్క్ కామెడీ, థ్రిల్లర్​గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఇదీ చూడండి: ఆర్​ఆర్​ఆర్-సీత పాత్రలో ఒదిగిపోయిన ఆలియా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.