ETV Bharat / sitara

'ఆకాశమే నీ హద్దురా' చిత్రానికి సమంత రివ్యూ - ఆకాశమే నీ హద్దురా మూవీ న్యూస్

కోలీవుడ్​ హీరో సూర్య నటించిన 'ఆకాశమే నీ హద్దురా' చిత్రానికి హీరోయిన్​ సమంత ఫిదా అయ్యారు. మంగళవారం సినిమా చూసిన సామ్​.. సూర్య, అపర్ణ బాలమురళి నటన అద్భుతంగా ఉందని సోషల్​మీడియాలో వెల్లడించారు. తనకు కావాల్సిన ప్రేరణ, స్ఫూర్తి ఈ సినిమాలో ఉన్నాయని సమంత అభిప్రాయపడ్డారు.

Samantha reviews Suriya's Soorarai Pottru, calls it film of the year
'ఆకాశమే నీ హద్దురా' చిత్రానికి సమంత రివ్యూ
author img

By

Published : Dec 1, 2020, 10:35 PM IST

స్టార్​ హీరోయిన్​ సమంత 'ఆకాశమే నీ హద్దురా' సినిమాకు ఫిదా అయ్యారు. సూర్య కథానాయకుడిగా నటించిన చిత్రమిది. సుధా కొంగర దర్శకురాలు. ఎయిర్‌ డెక్కన్‌ సంస్థను స్థాపించి అందరికీ తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం అందించిన కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితం ఆధారంగా రూపొందించారు. 'సింప్లీ ఫ్లే' అనే పుస్తకం ఆధారంగా తీసిన ఈ చిత్రం నవంబరు 12న ఓటీటీ వేదికగా విడుదలైంది. ఇన్నాళ్లూ విహారయాత్రలో ఉన్న సమంత తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించారు. దీనికి ఉత్తమ చిత్రం అవార్డు ఇవ్వొచ్చంటూ యూనిట్‌ సభ్యుల్ని మెచ్చుకున్నారు.

"ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 'ఆకాశమే నీ హద్దురా'. ఇది ఓ ఆణిముత్యం. సూర్య సర్‌, అపర్ణ బాలమురళి నటన అద్భుతంగా ఉంది. సుధా కొంగర డైరెక్షన్‌ అమేజింగ్‌. నాకు అవసరమైన ప్రేరణ, స్ఫూర్తి ఈ చిత్రంలో ఉన్నాయి."

- సమంత అక్కినేని, కథానాయిక

వారం రోజుల క్రితం ఆమె తన భర్త నాగచైతన్యతో కలిసి మాల్దీవుల విహారయాత్రకు వెళ్లారు. సోమవారం తిరిగి హైదరాబాద్‌ వచ్చారు. 'జాను' తర్వాత ఆమె తొలిసారి 'ది ఫ్యామిలీ మ్యాన్‌ 2' వెబ్‌ సిరీస్‌ కోసం పనిచేశారు. ఓటీటీ వేదికగా ఇది త్వరలో విడుదల కాబోతోంది.

ఇదీ చూడండి: 'బచ్చన్​ పాండే'లో కీలక పాత్రకు ఎంపికైన జాక్వెలిన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.