ETV Bharat / sitara

'ఆ విషయంలో బాలీవుడ్​కు ఒత్తిడి తక్కువ' - బాలీవుడ్​ దక్షిణాది సినిమాల మధ్య వ్యత్యాసం

దక్షిణాది చిత్రపరిశ్రమలతో పోలిస్తే బాలీవుడ్​లో సినిమాల నిర్మాణంలో పెద్దగా ఒత్తిడి ఉండదని అంటున్నారు స్టార్​ హీరోయిన్​ సమంత. నిర్దిష్టమైన శైలిని ఇష్టపడే ప్రేక్షకులే లక్ష్యంగా చిత్రాన్ని రూపొందించవచ్చని.. ఈ విధంగా దక్షిణాది పరిశ్రమల్లో కుదరదని సామ్​ అభిప్రాయపడ్డారు.

Samantha on difference between Bollywood and South film industries
ఆ విషయంలో బాలీవుడ్​కు ఒత్తిడి తక్కువ: సమంత
author img

By

Published : Dec 20, 2020, 10:03 AM IST

స్టార్​ హీరోయిన్​ సమంత నటించిన తొలి వెబ్​సిరీస్​ 'ది ఫ్యామిలీ మ్యాన్​-2' అమెజాన్​ ప్రైమ్​ వేదికగా త్వరలోనే విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన సామ్​.. బాలీవుడ్​, దక్షిణాది చిత్రపరిశ్రమల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు.

"బాలీవుడ్​లో ఒక నిర్దిష్టమైన శైలిని ఇష్టపడే ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని సినిమా చేయడానికి స్వేచ్ఛ ఉంటుంది. ప్రతి ఒక్కరి అంచనాలను చేరుకోవాలన్న ఒత్తిడి ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. కానీ, దక్షిణాది చిత్రపరిశ్రమల విషయంలో మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ప్రతి ఒక్క ప్రేక్షకుడిని థియేటర్​కు రప్పించాలనే ఉద్దేశంతో సినిమా రూపొందించాల్సి ఉంటుంది" అని సమంత పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'జిమ్​లు లేక 45 అంతస్తులు ఎక్కిదిగేదాన్ని'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.