samantha fashion: టోర్న్ జీన్స్ గురించి మీరు వినుంటారు, వాడుంటారు కూడా. వాటి మీద వచ్చిన జోక్స్ విని నవ్వుకొని ఉంటారు కూడా. అయితే ఇప్పడు టోర్న్ జీన్స్‌లా... టోర్న్ డ్రెస్‌లు వస్తున్నాయి. అంతేకాదు వాటికి పిన్నీసులు కూడా యాడ్ అయ్యాయి. అంటే చిరిగిన (చింపిన) చోట పిన్నీసులు పెడతారు. హాలీవుడ్ ఫ్యాషన్ షోస్‌లో ఇప్పటికే కనిపిస్తున్న ఈ ఫ్యాషన్ ఇటీవల మన దేశంలోకి కూడా వచ్చింది. ఆ మధ్య ఎప్పుడో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌటేలా ఇలాంటి ఓ డ్రెస్ వేసుకున్నారు. ఇప్పుడు సౌత్ బ్యూటీ సమంత కూడా అదే పని చేశారు(samantha torn pin dress). ఓ యాడ్ షూట్ కోసం బయటకు వచ్చిన సామ్.. తిరిగి వెళ్తూ ఇలాంటి టోర్న్- పిన్ డ్రెస్‌లో కనిపించారు.
ట్రెండ్‌కు అనుగుణంగా తన స్టైల్‌ను మార్చుకుంటూ టాలీవుడ్‌లో ఫ్యాషన్ లేడీగా పేరు తెచ్చుకున్నారు నటి సమంత. వెరైటీ డ్రెస్‌లో తళుక్కుమన్న సామ్ సరికొత్త ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే హాలీవుడ్, బాలీవుడ్ తారలు కొంతమంది భారీ పిన్నీసులతో ఉన్న డ్రెస్‌లను ధరించి గతంలో ఆశ్చర్యపరిచారు. ఆ ఫొటోలు మీరూ చూసేయండి.
ఇదీ చూడండి: 2021.. చాలా 'కఠినమైన' సంవత్సరం: సమంత