ETV Bharat / sitara

'పుష్ప 2'లోనూ సమంత.. ఈ సారి ఆ పాత్రలో! - సమంత పుష్ప 2 అప్డేట్స్​

Pushpa 2 Samantha: అల్లుఅర్జున్​ 'పుష్ప 2' సినిమాలోనూ హీరోయిన్​ సమంత కనిపించనుందని సమాచారం.​ దర్శకుడు సుకుమార్​.. ఆమె కోసం ప్రత్యేకంగా ఓ పాత్రను తీర్చిదిద్దుతున్నారట. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

pushpa 2 samantha
పుష్ప 2 సమంత
author img

By

Published : Mar 26, 2022, 9:10 PM IST

Pushpa 2 Samantha: 'పుష్ప' చిత్రంతో పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్‌ . సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. బన్నీ మాస్​గెటప్​, నటన, దేవీ శ్రీ ప్రసాద్​ మ్యూజిక్​​ సినిమాకే హైలెట్​గా నిలిచాయి. ముఖ్యంగా సమంత చిందులేసిన 'ఊ అంటావా మావ' స్పెషల్​ సాంగ్​ దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో 'పుష్ప2' తెరకెక్కించనున్నారు. త్వరలోనే ఇది సెట్స్​పైకి వెళ్లనుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా గురించి రోజుకో ఆసక్తికరమైన వార్త బయటకు వస్తోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

తాజాగా.. దర్శకుడు సుకుమార్​ కథలో కొన్ని మార్పులు చేస్తున్నారని తెలిసింది. తొలి భాగంలో స్పెషల్​ అట్రాక్షన్​గా నిలిచిన సామ్​ను 'పార్ట్​ 2'లోనూ కనిపించేలా ఆయన​ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఆమె కోసం ప్రత్యేకంగా ఓ కీలక పాత్రను తీర్చిదిద్దుతున్నారట. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. కాగా, ఈ రెండో భాగంలోనూ ప్రత్యేక గీతం ఉంటుందని, ఇందులో బాలీవుడ్​ హాట్​ బ్యూటీ దిశాపటానీ చిందులేయనుందని ప్రచారం సాగుతోంది.

ఇదీ చూడండి: 'ఆర్​ఆర్​ఆర్'​పై మహేశ్​, బన్నీ ఏమన్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.