ETV Bharat / sitara

ఇప్పుడు వారే నాకు తోడు: సమంత - samantha instagram posts

స్టార్​ హీరోయిన్​ సమంత(samantha movie list) ... నేడు(సెప్టెంబరు 27) హైదరాబాద్​ నగరంలో వర్షం పడుతుండగా పారా సైక్లిస్ట్​లతో కలిసి సైకిల్​ రైడ్​కు వెళ్లారు. ఈ పారా సైక్లిస్ట్స్​, సైకిలింగ్​ తనకు స్ఫూర్తి అని చెప్పారు. వారే తనకు తోడు అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్​ చేశారు.

samantha
సమంత
author img

By

Published : Sep 27, 2021, 6:08 PM IST

అగ్ర కథానాయిక సమంత(samantha movie list) సినిమాలతో సందడి చేయడమే కాదు.. కాస్త సమయం దొరికితే తనకు నచ్చిన పనుల్లో నిమగ్నమైపోతున్నారు. సోమవారం(సెప్టెంబరు 27) ఉదయం హైదరాబాద్‌ నగరంలో వర్షం పడుతుండగా.. పారా సైక్లిస్ట్స్‌తో కలిసి సైకిల్‌ రైడ్‌కు వెళ్లారామె. ఈ సందర్భంగా వారితో కలిసి సైకిల్‌ తొక్కుత్కున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో షేర్ చేశారు. "ప్రతి రోజూ ఈ పారా సైక్లిస్ట్స్‌, సైకిలింగ్‌ నాకు స్ఫూర్తి. వర్షంలో వీరితో కలిసి ఇలా సైకిల్‌ తొక్కడం.. అదే ఓ చక్కటి తోడు. తొలిరోజే 21కిలోమీటర్లు తొక్కా. త్వరలోనే వంద కిలో మీటర్లను చేరుకునేందుకు సిద్ధంగా ఉన్నా" అని తెలిపారు.

samantha
సమంత
samantha
సమంత

ఇటీవలే షూటింగ్స్‌ నుంచి బ్రేక్‌ తీసుకున్న సమంత(samantha and keerthi suresh movie together) తన స్నేహితులు కీర్తి సురేష్‌, త్రిష, కల్యాణి ప్రియదర్శన్‌తో సరదాగా గడిపారు. తన పెంపుడు కుక్క పిల్లలు హ్యాష్‌, సాషా విశేషాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నారు. త్వరలోనే సామ్​.. గుణశేఖర్​ దర్శకత్వంలో తెరకెక్కిన 'శాకుంతలం'(samantha shakuntala movie) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

కాగా, కొంతకాలం నుంచి సామ్​.. తన భర్త, హీరో నాగచైతన్యతో విడిపోయారంటూ నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే వారిద్దరూ స్పందించేవరకు వేచి ఉండాల్సిందే.

ఇదీ చూడండి: నాగచైతన్య-సమంత విడిపోతున్నారా.. నిజమెంత?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.