హీరో నాగచైతన్య పుట్టిన రోజును, తన భార్య సమంతతో కలిసి గోవాలో సెలబ్రేట్ చేసుకున్నాడు. అక్కడ దిగిన ఓ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన సమంత.. భావోద్వేగమైన ఓ వ్యాఖ్యను జోడించింది.
"పుట్టినరోజు శుభాకాంక్షలు చై అక్కినేని. నీ సంతోషం కోసమే ప్రతిరోజూ ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తాను. జీవితంలో ఎదిగే క్రమంలో ఎప్పుడూ నిన్ను నువ్వు కొత్తగా మలుచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మనం ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటామని బలంగా నమ్ముతున్నాను. ఐ లవ్ యూ డార్లింగ్"
-సమంతా అక్కినేని, హీరోయిన్
నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలోనూ, వెంకటేశ్‌తో కలిసి 'వెంకీమామ' అనే మల్టీస్టారర్‌లోనూ నటిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి:'సరిలేరు నీకెవ్వరూ' నుంచి మరో సర్ప్రైజ్