బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ నటిస్తున్న చిత్రం 'దబాంగ్-3'. ఇప్పటికే టీజర్ అలరిస్తుండగా.. ఆ సందడిని మరికాస్త పెంచేందుకు ట్రైలర్ సిద్ధమైంది. ఈ బుధవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని తానే స్వయంగా ట్విట్టర్లో వెల్లడించాడు. ఈ సందర్భంగా హీరోయిన్ సోనాక్షి సిన్హా పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియోను పంచుకున్నాడు
-
#2DaysToDabangg3Trailerhttps://t.co/5TbvkXkm5I@sonakshisinha @arbaazSkhan @saieemmanjrekar @PDdancing @KicchaSudeep @nikhil_dwivedi @SKFilmsOfficial @saffronbrdmedia
— Chulbul Pandey (@BeingSalmanKhan) October 21, 2019 ." class="align-text-top noRightClick twitterSection" data="
.">#2DaysToDabangg3Trailerhttps://t.co/5TbvkXkm5I@sonakshisinha @arbaazSkhan @saieemmanjrekar @PDdancing @KicchaSudeep @nikhil_dwivedi @SKFilmsOfficial @saffronbrdmedia
— Chulbul Pandey (@BeingSalmanKhan) October 21, 2019
.#2DaysToDabangg3Trailerhttps://t.co/5TbvkXkm5I@sonakshisinha @arbaazSkhan @saieemmanjrekar @PDdancing @KicchaSudeep @nikhil_dwivedi @SKFilmsOfficial @saffronbrdmedia
— Chulbul Pandey (@BeingSalmanKhan) October 21, 2019
ముంబయి, హైదరాబాద్ సహా మరో 9 ప్రధాన నగరాల్లో ట్రైలర్ లాంచ్ వేడుకల్ని ఘనంగా నిర్వహించనున్నారు. అభిమాన సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సల్మాన్.. అభిమానుల ముందుకు రానున్నాడు.
ముంబయిలో నిర్వహించే ప్రధాన వేడుకలో కండలవీరుడితో పాటు దర్శకుడు ప్రభుదేవా, హీరోయిన్ సోనాక్షి సిన్హా, ప్రతినాయకుడు కిచ్చా సుదీప్ పాల్గొనున్నారు. ఈ నెల 25న విడుదలయ్యే 'హౌస్‌పుల్ 4' చిత్రంతో పాటు ఈ ట్రైలర్‌ను థియేటర్లలో ప్రదర్శించనున్నారు.
ఇదీ చూడండి : కొడుకు కంటే విక్రమ్‌కే టెన్షన్ ఎక్కువవుతోంది..!