బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌కు.. కృష్ణ జింకల వేట, అక్రమ ఆయుధాల కేసులో సమన్లు జారీ చేసింది జోధ్‌పుర్ కోర్టు. సెప్టెంబరు 28న న్యాయస్థానం ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది.
1998లో 'హమ్ సాత్ సాత్ హై' సినిమా షూటింగ్ సందర్భంగా జోధ్‌పుర్‌లోని కంకణి గ్రామంలో.. సల్మాన్, సైఫ్ అలీ ఖాన్, సొనాలీ బింద్రే, టబు, నీలమ్.. కృష్ణ జింకలను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద వారిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో లైసెన్స్ లేకుండా ఆయుధాలను కలిగి ఉన్నందున ఆయుధాల చట్టం కింద అక్కడి అటవీ విభాగం సల్మాన్ పై కేసు నమోదు చేసింది. దీనిపై జైలుకు కూడా వెళ్లాడీ నటుడు. ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు.
ఇదీ చూడండి నాన్న వ్యాయామం చేస్తున్నారు: చరణ్