ETV Bharat / sitara

నటనలోనే కాదు.. పెయింటింగ్​లోనూ టాపే.. - సోనాక్షి సిన్హా పెయింటింగ్

నటనలోనే కాదు పెయింటింగ్​లోనూ తాము అదరగొట్టేస్తామని ఈ బాలీవుడ్ స్టార్స్ నిరూపిస్తున్నారు. ఖాళీ సమయాల్లో తమలోని చిత్రకళను ప్రదర్శిస్తున్నారు. తాము గీసిన చిత్రాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్​ చేస్తూ.. అభిమానుల చేత వావ్ అనిపించుకుంటున్నారు. వారి పెయింటింగ్స్​పై మీరూ ఓ లుక్కేయండి.

bollywood stars painting
బాలీవుడ్ స్టార్స్ పెయింటింగ్
author img

By

Published : Nov 13, 2021, 6:48 PM IST

బాలీవుడ్​లో స్టార్స్​గా గుర్తింపు తెచ్చుకున్న చాలామంది యాక్టర్స్​.. అనేక విషయాల్లో తమకున్న ప్రతిభను బయటపెడుతున్నారు. ఇప్పటికే చాలామంది సినీతారలు.. తమకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టమని తెలిపారు. షూటింగ్​ సమయంలో ఏమాత్రం ఖాళీ దొరికినా తమకు నచ్చిన చిత్రాన్ని గీస్తూ.. ఆనందాన్ని పొందుతామని అంటున్నారు. కొంతమంది లాక్​డౌన్​ సమయంలో చిత్రకళను నేర్చకోగా.. మరికొందరు.. తమకు చిన్నప్పటినుంచే పెయింటింగ్​పై పట్టుందంటున్నారు. మరి వారి పెయింటింగ్స్​పై ఓ లుక్కేద్దామా?

వేలంపాటలో అమ్మి..

Salman Khan
చిత్రాన్ని గీస్తున్న కండలవీరుడు సల్మాన్​
Salman Khan
సల్మాన్​ఖాన్ పెయింటింగ్స్​

బాలీవుడ్‌ స్టార్​ సల్మాన్‌ఖాన్‌కు పెయింటింగ్​ అంటే తెగ ఇష్టమట. ఇప్పటికే అనేక సందర్భాల్లో తాను గీసిన పెయింటింగ్స్​ను షేర్ చేశాడు ఈ కండలవీరుడు. తన పాన్వెల్ బంగ్లాలో చిత్రకళకు సంబంధించి అనేక కలెక్షన్స్ ఉన్నాయంట. వాటిని వేలంపాటలో అమ్మేయగా వచ్చిన డబ్బును.. తన ఎన్​జీఓ 'బీయింగ్ హ్యూమన్​'కు తరలిస్తున్నాడంట సల్మాన్​.

దేనికవి ప్రత్యేకంగా..

sonakshi sinha
సోనాక్షి పెయింటింగ్స్
sonakshi sinha
తన పెయింటింగ్​తో సోనాక్షి సిన్హా
sonakshi sinha
సోనాక్షి సిన్హా పెయింటింగ్​

బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా.. తాను గీసిన పెయింటింగ్స్​ను ఎప్పటికప్పుడు ఇన్​స్టాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తనకు ముఖాలను డ్రా చేయడం ఇష్టమని చెబుతోంది. ఫేస్ చిత్రం ద్వారా విజ్యువల్ స్టోరీస్​ను ప్రదర్శించటం చేస్తుందట. తన స్కెచింగ్స్ దేనికవి ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటానంటోంది సోనాక్షి. ఇప్పటికే చాలా పెయింటింగ్స్​ను వేలపాటంలో అమ్మి రోజూవారీ కూలీలకు నిధులు అందించింది.

పెయింటింగ్​కు ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్​..

ileana
ఇలియానా బ్యూటిఫుల్​ పెయింటింగ్

నాయికగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. తెలుగులోనూ పలు హిట్ చిత్రాల్లో మెరిసింది. అయితే.. ఇలియానాకు పెయింటింగ్​లోనూ మంచి ప్రతిభ ఉంది. తాను గీసిన పెయింటింగ్​ను సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేసే ముందు.. ఆ చిత్రానికి సంబంధించి ఓ పద్యాన్ని అభిమానులతో పంచుకుంది. తర్వాత పెయింటింగ్​ను ఇన్​స్టాలో పోస్ట్​చేసింది.

బిజీగా ఉన్నా పెన్సిల్ పట్టాల్సిందే..

siddant chaturvedi
తన పెయింటింగ్​తో సిద్ధాంత్ చతుర్వేది

'గల్లీబాయ్​' సినిమాలో కీలకపాత్ర పోషించి గుర్తింపు తెచ్చుకున్నాడు బాలీవుడ్ నటుడు సిద్ధాంత్​ చతుర్వేది. ప్రస్తుతం 'భూత్​ పోలీస్​' షూటింగ్​తో బిజీగా ఉన్నాడు. అయితే సిద్ధాంత్​కు చిత్రకళ అంటే ఇష్టమట. కొన్నినెలల క్రితం తన ఇన్​స్టాలో ఓ చిత్రాన్ని పోస్ట్​చేశాడు సిద్ధాంత్​. అందులో పెయింటింగ్​ వేస్తూ కనిపించాడు. ఓసీన్​ను కాన్వాస్​లో గీస్తూ కనివిందు చేశారు.

ఫాదర్​కు గిఫ్ట్​ ఇచ్చా..

wambika gabbi
తన పెయింటింగ్​తో వాంబికా గబ్బి

నటి వామికా గబ్బి పలు పంజాబీ, హిందీ, మలయాళం చిత్రాల్లో నటించింది. అయితే వామికకు చిన్నప్పటి నుంచి పెయింటింగ్ అలవాటు ఉందంట. చిత్రకళను మెడిటేషన్​లో భాగంగానే భావిస్తానంటోంది. షూటింగ్​కు వెళ్లినా.. తన బ్యాగ్​లో స్కెచ్​ పెన్సిల్స్ ఉండాల్సిందే అంటోంది. కాస్త ఖాళీ దొరికినా ఏదో ఒక చిత్రం గీసేస్తానంటుంది. ఇటీవల తన తండ్రి పెయింటింగ్​ను గీసి.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో గిఫ్ట్ ఇచ్చిందట.

వర్షం పడుతుంటే పెన్సిల్ పట్టుకుంటా..

tara sutaria
తారా సుతారియా పెయింటింగ్స్

పలు హిందీ చిత్రాలు, బుల్లితెరపై నటిగా, గాయనిగా గుర్తింపు తెచ్చుకుంది తారా సుతారియా. లాక్​డౌన్​ వేళ తాను పెయింటింగ్​ నేర్చుకున్నట్లు చెప్పింది తారా. పూర్తిగా చార్​కోల్​(బొగ్గు)తో గీసిన పెయింటింగ్​ను తన ఇన్​స్టాలో పోస్ట్​ చేసి.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వర్షం పడుతుంటే చిత్రాలను గీయటం తనకిష్టమంటోంది తారా.

ఇదీ చూడండి: NBK107: బాలకృష్ణ కొత్త సినిమా షూటింగ్​ షురూ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.