ETV Bharat / sitara

రైతుల గౌరవార్థం సల్మాన్​ఖాన్​ కొత్త పోస్ట్​ - తాజా సల్మాన్​ఖాన్​

బాలీవుడ్​ కండలవీరుడు సల్మాన్​ఖాన్​ మరోసారి వ్యవసాయ క్షేత్రంలో దర్శనమిచ్చాడు. పొలంలో పని చేస్తూ శరీరమంతా మట్టిని పులుముకొన్న ఫొటోను ఇన్​స్టాగ్రామ్​లో అభిమానులతో పంచుకున్నాడు.

Salman Khan pays respect to farmers in new post
సల్మాన్​ఖాన్​
author img

By

Published : Jul 14, 2020, 10:53 PM IST

కరోనా కారణంగా విధించిన లాక్​డౌన్​ అందరి జీవితాల్ని చిన్నాభిన్నం చేసింది. ఈ క్రమంలోనే సినీ తారలు షూటింగులు లేక ఇళ్లకే పరిమితమయ్యారు. బాలీవుడ్​ హీరో సల్మాన్​ఖాన్​ మహారాష్ట్రలోని తన ఫాంహౌస్​లో నివసిస్తున్నాడు. తాజాగా తన పొలంలో పని చేస్తూ శరీరమంతా మట్టిని పులుముకుని కనిపించాడీ కండలవీరుడు. అందుకు సంబంధించిన ఫొటోను ఇన్​స్టాగ్రామ్​ వేదికగా పంచుకుంటూ.. 'రైతులకు గౌరవార్థం' అని రాసుకొచ్చాడు.

ఈ లాక్​డౌన్​ సమయంలో సల్మాన్​ ఎక్కువగా వ్యవసాయ క్షేత్రంలో గడుపుతున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఈ తరహాలోనే పోస్టులను అభిమానులతో పంచుకున్నాడు.

సల్మాన్​ చివరిగా 'దబాంగ్​ 3'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం 'రాధే' సినిమాలో నటిస్తున్నాడు. కానీ లాక్​డౌన్​ కారణంగా ఈ సినిమా షూటింగ్​ వాయిదా పడింది. ఇందులో సల్మాన్​ సరసన దిశా పటానీ కనిపించనుంది.

ఇదీ చూడండి:'లవ్‌ మాక్‌టైల్'‌​లో కుర్రహీరోతో తమన్నా రొమాన్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.