దర్శకుడు శంకర్-హీరో రామ్‌చరణ్ కాంబోలో తెరకెక్కనున్న పాన్ ఇండియా సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలోని ఓ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటింపచేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోందని ఈ సినిమాకు చెందిన ఓ ప్రతినిధి తెలిపారు. త్వరలోనే శంకర్-చెర్రీ.. సల్మాన్‌ను కలిసి ఈ విషయమై చర్చించనున్నారని వెల్లడించారు. ఒకవేళ ఇది కుదరకపోతే మరో బాలీవుడ్ స్టార్‌ను తీసుకుంటారని చెప్పారు. మరి ఈ పాత్ర చేయడానికి కండలవీరుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో లేదో తెలియాలంటే ఇంకొన్ని కొన్ని రోజులు వేచి ఉండాల్సిందే.
రామ్‌చరణ్ ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్', 'ఆచార్య' చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాల చిత్రీకరణ వేగంగా జరుగుతోంది. ఇవి పూర్తయిన వెంటనే రామ్‌చరణ్ నేరుగా శంకర్ క్యాంపులో చేరిపోతారని టాక్. జూన్‌లో ఈ సినిమాను మొదలు పెట్టేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మించనున్నారు. మరోవైపు శంకర్ 'భారతీయుడు2'ను ప్రస్తుతానికి పక్కన పెట్టారు.
ఇదీ చూడండి: శంకర్-చెర్రీ కాంబో సినిమాలో చిరంజీవి!