'రాధే' చిత్రానికి రివ్యూ ఇచ్చిన కమాల్ ఆర్.ఖాన్ అనే వ్యక్తిపై హీరో సల్మాన్ ఖాన్ లీగల్ టీమ్ కోర్టును ఆశ్రయించింది. ముంబయి సిటీ కోర్టులో పరువు నష్టం దావా కేసు నమోదు చేసి సదరు వ్యక్తికి నోటీసులు పంపింది. ఇదే విషయాన్ని కమాల్ ఆర్.ఖాన్ తన ట్విట్టర్లో వెల్లడించారు. రాధే సినిమా రివ్యూ వ్యవహారమై ఇదంతా చేశారని ఆయన పేర్కొన్నారు.
"సినిమా నిర్మాత నన్ను రివ్యూ ఇవ్వొద్దంటే ఇవ్వనని చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు నా రివ్యూపై సల్మాన్ ఖాన్ పరువు నష్టం దావా వేశారు. నేను రాసిన రివ్యూ వల్ల సల్మాన్ ఇబ్బంది పడ్డారనుకుంటా. ఇకపై సల్మాన్ చిత్రాలకు రివ్యూ ఇవ్వను".
- కమాల్ ఆర్.ఖాన్ ట్వీట్ సారాంశం
అయితే కమాల్ ఇచ్చిన 'రాధే' చిత్ర రివ్యూపై ముంబయి సిటీ సివిల్‌కోర్టులో గురువారం విచారణ చేయాలని సల్మాన్ లీగల్ టీమ్ కోర్టుకు విన్నవించుకుంది.
-
I said so many times that I never review film of any producer, actor if he asks me to not review. Salman khan filed defamation case on me for review of #Radhe means he is getting too much affected by my review. Hence I won’t review his films anymore. My last video releasing today
— KRK (@kamaalrkhan) May 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">I said so many times that I never review film of any producer, actor if he asks me to not review. Salman khan filed defamation case on me for review of #Radhe means he is getting too much affected by my review. Hence I won’t review his films anymore. My last video releasing today
— KRK (@kamaalrkhan) May 26, 2021I said so many times that I never review film of any producer, actor if he asks me to not review. Salman khan filed defamation case on me for review of #Radhe means he is getting too much affected by my review. Hence I won’t review his films anymore. My last video releasing today
— KRK (@kamaalrkhan) May 26, 2021
ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించగా సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, రీల్ లైఫ్ ప్రొడక్షన్స్ నిర్మించాయి. దిశా పటానీ, రణ్‌దీప్ హుడా, జాకీ ష్రాఫ్ కీలక పాత్రలు పోషించారు. మే 13 ఈ సినిమా జీఫ్లెక్స్ వేదికగా పే పర్ వ్యూ పద్దతిలో ప్రేక్షకుల ముందుకొచ్చిందీ చిత్రం.
ఇదీ చూడండి: 'రాధే'కు భారీ నష్టాలు పక్కా.. అయినా ఓకే: సల్మాన్