Salman khan gave message to fans: సాధారణంగా అభిమానులు తమ హీరో సినిమా విడుదల రోజు హడావుడి చేస్తుంటారు. అల్లరి చేయడం, థియేటర్లో పేపర్స్ విసరడం, ఫ్లెక్సీలపై పాలాభిషేకం వంటివి చేసి తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు. వీరిలో కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించేవారూ ఉంటారు.
ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన 'అంతిమ్: ది ఫైనల్ ట్రూత్'(Salman khan antim movie) సినిమా విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా కొంతమంది ఫ్యాన్స్.. సల్మాన్ ఫ్లెక్సీపై లీటర్ల కొద్ది పాలతో అభిషేకం చేశారు. మరికొంతమంది థియేటర్లో టపాసులు కాలుస్తూ పక్కవారిని భయాందోళనకు గురి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
తాజాగా దీనిపై స్పందించిన సల్మాన్.. "కొంతమందికి తాగడానికి నీరు దొరకడం లేదు. మీరు పాలను వృథా చేసే బదులు వాటిని పేదపిల్లలకు ఇవ్వాలని కోరుతున్నాను" అని విజ్ఞప్తి చేశారు. టపాసులు కాల్చే విషయమై స్పందిస్తూ.. "థియేటర్లో ఇలాంటి పనులు చేయకండి. ఇలాంటి పనుల వల్ల మీ ప్రాణాలతో పాటు, తోటివారి ప్రాణాలకు కుడా నష్టం జరిగే అవకాశం ఉంది. ఫ్యాన్స్ క్రాకర్స్ తీసుకొని థియేటర్లలోకి ప్రవేశించకుండా నిర్వాహకులు సరైన చర్యలు తీసుకోవాలి." అని అన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇదీ చూడండి: సల్మాన్ కొత్త సినిమాలో తొమ్మిది మంది హీరోయిన్లు