బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'అంతిమ్: ది ఫైనల్ ట్రూత్'(salman khan antim movie trailer). ఆయుష్ శర్మ కీలకపాత్ర పోషించాడు. మహేశ్ వి.మంజ్రేకర్ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది(salman khan antim movie). సోమవారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో సల్మాన్ సిక్కు పోలీసు అధికారిగా కనిపించారు. గ్యాంగ్‌స్టర్స్‌కు, పోలీసులకు మధ్య జరిగే పోరాటం నేపథ్యంలో ఈ కథ సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. నవంబరు 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ప్రముఖ నటుడు, దర్శకుడు మహేష్ మంజ్రేకర్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన సినిమా 'లవ్‌స్టోరీ'(lovestory movie) ఇటీవల విడుదలై సూపర్‌హిట్‌గా నిలిచింది. ఇప్పడీ చిత్రాన్ని 'ప్రేమతీరమ్' పేరుతో మలయాళంలో అక్టోబర్ 29న విడుదల చేయనున్నారు(lovestory movie release date). ఈ సందర్భంగా సోమవారం(అక్టోబర్ 25) దీనికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
తమిళ హీరో శివకార్తికేయన్(siva karthikeyan movie list) నటించిన 'వరుణ్ డాక్టర్'(varun doctor movie) సినిమా ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడీ మూవీ ఓటీటీ వేదికగా సందడి చేసేందుకు సిద్ధమైంది. సన్‌నెక్ట్స్‌లో నవంబరు 4నుంచి స్ట్రీమింగ్ కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన 'వరుడుకావలెను'(varudu kaavalenu pre release event) సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 27న నిర్వహించనున్నారు. ఈ వేడుకకు హీరో అల్లుఅర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు (naga shaurya ritu varma movie). ఈ చిత్రానికి లక్ష్మి సౌజన్య దర్శకత్వం వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. తమన్ సంగీతమందించారు. మురళీ శర్మ, నదియా, వెన్నెల కిశోర్, ప్రవీణ్, హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 29న విడుదల కానుందీ సినిమా.
ఇదీ చూడండి: 'పుష్ప' సాంగ్ ప్రోమో.. 'రొమాంటిక్' కొత్త ట్రైలర్