హైబ్రిడ్ పిల్ల అంటే మరో ఆలోచన లేకుండా గుర్తొచ్చే పేరు సాయిపల్లవి. 'ఫిదా'తో తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ. అంతకుముందే 'ప్రేమమ్'లో తన హావాభావాలతో కట్టిపడేసింది. శర్వానంద్ హీరోగా 'పడిపడి లేచే మనసు'తో కుర్రకారు మనసు దోచేసిన నటి సాయి పల్లవి. నేడు ఆమె పుట్టినరోజు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించింది సాయి పల్లవి. 2009లో ఈటీవీలో వచ్చిన ఢీ4లో తన డ్యాన్స్‌తో అందరినీ మెప్పించింది. మలయాళంలో వచ్చిన 'ప్రేమమ్' సినిమాలో 'మలర్' పాత్ర మంచి గుర్తింపు తెచ్చింది. తెలుగులో 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన 'ఫిదా' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ మూవీలో తెలంగాణ యాస మాట్లాడుతూ తన హావభావాలతో ఆకట్టుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నటనతో పాటు డ్యాన్స్‌లోనూ దుమ్మురేపగల నటి సాయి పల్లవి. తను నర్తించిన పాటలకు యూట్యూబ్‌లో మంచి ఆదరణ ఉంది. దక్షిణాదిలో అత్యధిక వీక్షణలు వచ్చిన వీడియోల్లో మొదటి రెండు స్థానాలు పల్లవివే కావడం విశేషం. రౌడీ బేబీ, వచ్చిండే పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉన్నాయంటే అందుకు కారణం సాయిపల్లవే. ప్రస్తుతం తమిళంలో సూర్య సరసన 'ఎన్జీకే' సినిమాలో నటిస్తోంది. త్వరలో ఈ చిత్రం విడుదలవబోతోంది.
ఇవీ చూడండి.. 'విజయా'ల దేవరకొండకు బర్త్‌డే విషెస్