బాలీవుడ్ ప్రేమ జంట సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్లు బుధవారం ఓ శుభవార్త చెప్పారు. తాము రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు ప్రకటించారు. వారికి మద్దతుగా నిలిచిన శ్రేయోభిలాషులందరికి ధన్యవాదాలు తెలుపుతూ.. గర్భధారణ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.
"మా కుటుంబంలోకి మరో కొత్త వ్యక్తి రాబోతున్నారని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. మీ ప్రేమను ఎల్లప్పుడూ అందించే శ్రేయోభిలాషులకు ధన్యావాదాలు" అని సైఫ్-కరీనా జోడి ఓ ప్రకటనలో తెలియజేశారు.
2012లో సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్లకు వివాహం జరిగింది. వీరిద్దరికీ ఇప్పటికే తైమూర్ అలీఖాన్ అనే కుమారుడు ఉన్నాడు. మరోవైపు సైఫ్ అలీఖాన్ మొదటి భార్య అమృత సింగ్కు సారా అలీఖాన్, ఇబ్రహిమ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.