ETV Bharat / sitara

Sai Dharam Tej: త్వరలోనే థియేటర్లలోకి 'రిపబ్లిక్​' - కొరటాల శివ రిపబ్లిక్​

సుప్రీమ్​ హీరో సాయి తేజ్​ (Sai Dharam Tej)- దర్శకుడు దేవకట్టా కాంబోలో తెరకెక్కిన చిత్రం 'రిపబ్లిక్​'(Republic Movie). ఈ సినిమాలోని తొలి సాంగ్​ 'గాన ఆఫ్​ రిపబ్లిక్'ను దర్శకుడు కొరటాల శివ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 'రిపబ్లిక్​'(Republic Movie) చిత్రం ద్వారా అందరూ ఆలోచింపజేసే విషయాన్ని మరింత బలంగా చెబుతారని ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Sai Dharam Tej's Republic Movie First Song Gaana Of Republic released
Sai Dharam Tej: త్వరలోనే థియేటర్లలోకి 'రిపబ్లిక్​'
author img

By

Published : Jul 11, 2021, 6:48 AM IST

సాయి తేజ్‌ (Sai Dharam Tej) కథానాయకుడిగా దేవ్‌ కట్టా (Deva Katta) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రిపబ్లిక్‌' (Republic Movie). ఐశ్వర్య రాజేశ్‌ కథానాయిక. మణిశర్మ (Mani Sharma) స్వరాలందిస్తున్నారు. ఈ సినిమా తొలి గీతాన్ని 'గాన ఆఫ్‌ రిపబ్లిక్‌' పేరుతో దర్శకుడు కొరటాల శివ శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు.

'ఎయ్‌ రారో..' అంటూ వినసొంపుగా సాగుతున్న ఈ పాటకు రెహమాన్‌ సాహిత్యమందించారు. అనురాగ్‌ కులకర్ణి, హైమత్‌ మహ్మద్‌, ఆదిత్య అయ్యంగార్‌, పృధ్వీచంద్ర సంయుక్తంగా ఆలపించారు. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో కొరటాల శివ (Koratala Siva) మాట్లాడారు.

"పాట చాలా బాగుంది. స్వేచ్ఛ గురించి చాలా గొప్పగా చెప్పారు. దేవ్‌ కట్టా తన సినిమాల్లో సున్నితమైన అంశాల్నీ చాలా ఇంటెన్స్‌గా చెబుతారు. నాకది చాలా నచ్చుతుంది. ఇప్పుడీ 'రిపబ్లిక్​'లోనూ అందరినీ ఆలోచింపజేసే విషయాన్ని మరింత బలంగా చెబుతారని ఆశిస్తున్నా. మాస్‌ పాటలోనూ మెలోడీ రాగాలు పలికించగలరు మణిశర్మ. అది ఆయనకు మాత్రమే సాధ్యమైన విషయం. తేజును నా సోదరుడిలా భావిస్తా. తనకు విజయం వస్తే నాకు వచ్చినంత ఆనంద పడతా. చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా."

- కొరటాల శివ, దర్శకుడు

"ఓ సినిమాను పెద్ద స్క్రీన్‌లో చూస్తే ఆ ఆనందమే వేరు. జనాలందరూ మునుపటిలా థియేటర్లకు వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తారని నమ్ముతున్నా. దేవ్‌ కట్టా సర్‌ నాకు మంచి కథ, పాత్ర ఇచ్చారు. నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాని నిర్మించారు. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తామ"న్నారు సాయితేజ్‌.

చిత్రదర్శకుడు దేవ్‌ కట్టా మాట్లాడుతూ.. "జీ స్టూడియోస్‌ వారు చాలా స్వేచ్ఛ ఇచ్చి సినిమా చేయడానికి అవకాశమిచ్చారు. అందుకే నేను అనుకున్న కథను అనుకున్నట్లుగా తెరకెక్కించగలిగా. మణిశర్మ మంచి స్వరాలిచ్చారు. రెహమాన్‌ చక్కటి సాహిత్యమిచ్చారు. చిత్ర బృందానికి కృతజ్ఞతలు" అన్నారు.

"తొలిసారి తేజుతో చేస్తున్నా. చాలా ఆనందంగా ఉంది. ఎప్పటి నుంచో దేవాతో పని చేయాలి అనుకునే వాడ్ని. అది ఇన్నాళ్లకు ఇలా కుదరడం సంతోషాన్నిచ్చింద"న్నారు సంగీత దర్శకుడు మణిశర్మ. ఈ కార్యక్రమంలో నిర్మాతలు జె.భగవాన్‌, జె.పుల్లారావు, బిఎస్‌.రవి, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి.. లాక్​డౌన్.. నాకు ఆ విషయాలు నేర్పింది: కాజల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.