మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు చెప్పిన కథ తేజ్‌కు నచ్చిందని సమాచారం. అన్నీ కుదిరితే త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశం ఉంది. అనిల్ సుంకర ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించబోతున్నాడట.
సూర్యతో 'మాస్', అజిత్‌తో 'గాంబ్లర్' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వెంకట్ ప్రభు. 'మానాడు' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.
ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'ప్రతిరోజు పండగే' చిత్రంలో నటిస్తున్నాడు తేజ్. అనంతరం దేవా కట్టా, వీరు పోట్లా డైరక్షన్లో సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నాడు. కొత్త దర్శకుడు సుబ్బు చెప్పిన కథకూ ఈ మెగా హీరో ఓకే చెప్పాడని సమాచారం. మరి వీటన్నంటినీ ఎప్పుడు పట్టాలెక్కిస్తాడన్న విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.
ఇవీ చూడండి.. 'సాహో' కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు: ప్రభాస్