ETV Bharat / sitara

Saidharamtej health: ఆస్పత్రి నుంచి సాయిధరమ్​ తేజ్​ ట్వీట్​! - సినిమా లేటెస్ట్​ న్యూస్​

ఇటీవల రోడ్డుప్రమాదంలో గాయపడిన టాలీవుడ్​ యువహీరో సాయిధరమ్​ తేజ్​ (Saidharamtej health) ఆస్పత్రి నుంచి ట్వీట్​ చేశారు. తన రిపబ్లిక్​ సినిమా గురించి స్పందించారు.

Saidharamtej health
సాయిధరమ్​ తేజ్​ ఆరోగ్యం
author img

By

Published : Oct 3, 2021, 7:09 PM IST

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువ కథానాయకుడు సాయిధరమ్‌తేజ్‌ (Saidharamtej health) కోలుకుంటున్నారు. ఈ మేరకు ట్విట్టర్‌ వేదికగా పోస్టు పెట్టి, అభిమానులకు చల్లటి కబురు చెప్పారు.

ట్విట్టర్‌లో థంబ్స్‌ అప్‌ సింబల్‌ చూపిస్తూ ''మీరు నాపై, నా సినిమా 'రిపబ్లిక్‌'పై చూపించిన ప్రేమ, అభిమానం, ఆదరణకు కృతజ్ఞతగా థ్యాంక్స్‌ చెప్పడం చాలా చిన్న మాట అవుతుంది. మీ అందరి ముందుకు త్వరలోనే వస్తా'' అని ట్వీట్‌ చేశారు.

  • Thanks is a small word to express my gratitude for your love and affection on me and my movie “Republic “
    See you soon pic.twitter.com/0PvIyovZn3

    — Sai Dharam Tej (@IamSaiDharamTej) October 3, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బైక్​ అదుపుతప్పి..

సెప్టెంబరు 10న స్పోర్ట్స్‌ బైక్‌పై ప్రయాణిస్తున్న సాయితేజ్‌ ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ ఘటనలో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే అపస్మారక స్థితిలో వెళ్లారు. హైదరాబాద్​ నగరంలోని కేబుల్‌ బ్రిడ్జ్‌- ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. హెల్మెట్‌ ఉన్నా, ప్రమాద తీవ్రత కారణంగా గాయాలు బలంగా తగిలాయి. వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు 108 సాయంతో దగ్గర్లోని మెడికవర్‌ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం అపోలో ఆస్పత్రికి తరలించారు.

నిలకడగా ఆరోగ్యం..

ప్రస్తుతం సాయితేజ్‌ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన కథానాయకుడిగా నటించిన 'రిపబ్లిక్‌' మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దేవా కట్టా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్‌, రమ్యకృష్ణ, జగపతిబాబులు కీలక పాత్రలు పోషించారు. సాయితేజ్‌ ఇందులో కలెక్టర్‌గా నటించి మెప్పించారు.

ఇవీ చూడండి: ఆ హీరో నాకెంతో ప్రత్యేకం: ఐశ్వర్య

Republic movie review: 'రిపబ్లిక్' మూవీ రివ్యూ

Lokesh: 'రిపబ్లిక్' సినిమా గురించి లోకేశ్ ట్వీట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.