వరుస సినిమాలతో బిజీ అయిపోతున్నాడు మెగా యువ హీరో సాయి ధరమ్ తేజ్. తాను నటించిన 'సోలో బ్రతుకే సో బెటర్' సినిమా డిసెంబర్ 25న విడుదలకు సిద్ధం కానున్న నేపథ్యంలో కొత్త సినిమాలకు ఓకే చెబుతున్నాడు. ప్రస్తుతం, విలక్షణ దర్శకుడు దేవ కట్టా దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభించనున్నాడు సాయితేజ్. ఇది ఇంకా పట్టాలెక్కకముందే మరో సినిమాకు సాయి సంతకం చేసినట్లు సమాచారం.
దర్శకుడు కృష్ణవంశీ అసిస్టెంట్ డైరెక్టర్ రామ్ చెప్పిన కథకు తేజ్ సై అన్నట్లు తెలుస్తోంది. గతంలో తేజ్.. కృష్ణవంశీతో పనిచేసినప్పుడు రామ్‌తో పరిచయం ఏర్పడిందట.
ఇదీ చదవండి:'ఆదిపురుష్' వివాదంపై సైఫ్ క్షమాపణలు