ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటించిన వెబ్‌సిరీస్ 'సేక్రెడ్ గేమ్స్' రెండో సీజన్ విడుదల తేదీ ఎట్టకేలకు ఖరారైంది. అందులోని తొలి ఎపిసోడ్ ఏప్రిల్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్ తొలిసీజన్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.
పోలీస్ అధికారి సర్తాజ్సింగ్ పాత్రలో అలరించాడు సైఫ్అలీఖాన్. నవాజుద్దీన్ సిద్ధిఖీ.. గణేశ్ గాయ్తొండే పాత్రలో ఆకట్టుకున్నాడు. రాధిక ఆప్టే కీలక పాత్రలో నటించింది. విక్రమ్ చంద్ర రాసిన 'సేక్రెడ్ గేమ్స్' నవల ఆధారంగా రూపొందిన ఈ వెబ్‌సిరీస్‌కు విక్రమాదిత్య మోత్వాని, అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించారు.
తొలి సీజన్ విజయవంతమైంది. రెండో సీజన్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన టీజర్‌కు విశేష ఆదరణ లభించింది.