ప్రభాస్, శ్రద్ధాకపూర్ జంటగా నటిస్తోన్న చిత్రం 'సాహో'. 'రన్ రాజా రన్' ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ చిత్రంలోని ఫొటో లీక్ అయింది. ఓ పాట చిత్రీకరణ సందర్భంగా క్లిక్ మనిపించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
దాదాపు రూ.300 కోట్లతో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. జాకీ ష్రాఫ్, నీల్ నితీష్ ముఖేష్, అరుణ్ విజయ్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
ఇవీ చూడండి.. గేమ్ ఆఫ్ థ్రోన్స్ చివరి సీజన్ వచ్చేసింది