ప్రభాస్ సినిమా కోసం రెండేళ్లుగా ఎదురుగా చూస్తున్న అభిమానులకు ఆ రోజు రానే వచ్చింది. సాహో చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలకానుంది. ఈ సినిమా దేశవ్యాప్తంగా 10వేల స్క్రీన్లపై ప్రదర్శితం కానుంది.
ఏపీలో ప్రత్యేక షోలు..
ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమా ప్రత్యేక షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సాధారణంగా ప్రదర్శించే నాలుగు షోలు కాకుండా అదనంగా 2 ప్రత్యేక షోలను నిర్వహించనున్నారు. ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 5 వరకు తెల్లవారుజామున ఒంటి గంట నుంచి రాత్రి 10 గంటల మధ్య ఈ షోలను ప్రదర్శిస్తారు. ఈ విషయంలో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ సంస్థ వినతి మేరకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
బాహుబలి తర్వాత రెబల్‌స్టార్ నటించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. 350 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రద్ధాకపూర్ కథానాయిక.
యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వస్తోన్న ఈ చిత్రంలో జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, మురళీ కృష్ణ, అరుణ్ విజయ్, వెన్నెల కిషోర్ తదితరులు నటించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇది చదవండి: బెస్ట్ ఫ్రెండ్ సీక్రెట్ చెప్పనున్న విజయ్ దేవరకొండ!