టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘సాహో’. ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉంది చిత్రబృందం. అయితే తన అభిమానులకు సోషల్‌మీడియా ద్వారా సోమవారం ఓ సర్‌ప్రైజ్ ఇచ్చాడు డార్లింగ్ హీరో. చిత్రంలోని 'బేబీ వోంట్ యూ టెల్ మీ' అంటూ సాగే గీతాన్ని ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నాడు.
దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్‌తో ‘సాహో’ను రూపొందించారు. ఇందులో రూ.2 వేల కోట్ల దోపిడీకి సంబంధించిన కేసును ఛేదించే అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ కనిపించనున్నాడు. ఈ సినిమాతో శ్రద్ధాకపూర్ తెలుగు తెరకు పరిచయమవుతోంది. బాలీవుడ్ తార జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ ప్రత్యేక గీతంలో అలరించనుంది.
జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్, మందిరా బేడీ, మహేశ్ మంజ్రేకర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. యూవీ క్రియేషన్స్ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహించాడు. ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: చిరంజీవి సినిమాలోని సీన్ నాని చిత్రంలో కాపీ!