ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ యుద్ధంలో సైనికులతోపాటు సాధారణ ప్రజలు కూడా ప్రాణాలు కోల్పోతుండటం వల్ల సినీ ప్రముఖులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్‌కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇదే విషయమై రెండు రోజుల క్రితం స్పందించిన ప్రముఖ నటి సమంత.. తాజాగా ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ పోస్టు షేర్ చేసింది. తన దేశం కోసం బలంగా నిలబడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీపై ప్రశంసలు కురిపించింది.
'వొలొదిమిర్ జెలెన్స్కీ కోసం దేవుడిని ప్రార్థిస్తున్నాం. యోధుడైన ఉక్రెయిన్ అధ్యక్షుడిని చరిత్ర కనిపెట్టింది. ఆయన తెగువ, ధైర్యసాహసాలే దానికి సాక్ష్యం' అని ఉన్న న్యూస్ ఆర్టికల్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను సమంత షేర్ చేసింది.
రష్యా ముప్పేట దాడి చేస్తున్నా.. తన ప్రజలకు ధైర్యం చెబుతూ.. శత్రువులకు వెన్ను చూపకుండా ధీరుడులా పోరాడుతున్నా జెలెన్స్కీని అంతర్జాతీయ సమాజం ప్రశంసిస్తోంది. ఉక్రెయిన్ మద్దతుగా నిలుస్తోంది.
ఇదీ చూడండి: ఉపగ్రహానికి హీరో పునీత్ పేరు- ప్రభుత్వ బడి విద్యార్థులే రూపకర్తలు!