ETV Bharat / sitara

సుశాంత్​ కేసులో విచారణకు సల్మాన్​ ఖాన్?​

సుశాంత్​ సింగ్ రాజ్​పుత్ చనిపోయి నెలరోజులైనా అతని మరణం వెనక ఉన్న మిస్టరీ ఇంకా తెలియలేదు. తాజాగా హీరో సల్మాన్​ ఖాన్​ను పోలీసులు ఈ కేసులో విచారించే వీలుందని వార్తలు వినిపిస్తున్నాయి.

alman Khan will be summoned by the Mumbai Police
సుశాంత్​ కేసులో విచారణకు సల్మాన్​ఖాన్?​
author img

By

Published : Jul 15, 2020, 7:33 PM IST

బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ మృతిపై ముంబయి పోలీసులు విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సుశాంత్​ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బాలీవుడ్​ ప్రముఖులతో సహా 35 మందిని దర్యాపు చేశారు. తాజాగా హీరో సల్మాన్ ​ఖాన్​ను కూడా పోలీసులు విచారణకు పిలిచినట్లు సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి.

అయితే, ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీనియర్​ అధికారి.. సల్మాన్​ ఖాన్​పై వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని స్పష్టం చేశారు.

సుశాంత్​ ఆత్మహత్యకు ముందు అనేక సినిమాలకు సంతకం చేశాడు. అయితే, కొంతమంది కుట్రపన్ని అతడిని ఈ ఒప్పందాల నుంచి తప్పించినట్లు నెటిజన్లు, కొంత మంది సినీ ప్రముఖుల ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే హిందీ పరిశ్రమలోని కొందరిని విచారించారు పోలీసులు. ఇటీవలే ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ వాంగ్మూలం తీసుకున్నారు.

ఈ మధ్య వచ్చిన పోస్ట్​మార్టం నివేదికలో సుశాంత్ ఊపిరాడక మరణించినట్లు నిర్ధరించారు వైద్యులు. ఏదేమైనా, రాజ్​పుత్​​ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఇదీ చూడండి:'సుశాంత్​ కుటుంబానికి అండగా ఉండండి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.