ETV Bharat / sitara

'ఆర్ఆర్ఆర్' రిలీజ్.. ఎవరూ ఆ సాహసం చేయొద్దు: సల్మాన్​ఖాన్ - ram charan RRR

RRR pre release event: 'ఆర్ఆర్ఆర్' సినిమాపై అంచనాల్ని పెంచుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు స్టార్ హీరో సల్మాన్​ఖాన్. ఇంతకీ ఈ కథానాయకుడు ఏమన్నాడంటే?

RRR pre release event
ఆర్ఆర్ఆర్ మూవీ
author img

By

Published : Dec 19, 2021, 10:43 PM IST

RRR movie: 'ఆర్ఆర్ఆర్' ప్రీ రిలీజ్​ ముంబయిలో ఆదివారం సందడిగా జరిగింది. ఈ ఈవెంట్​కు బాలీవుడ్​ స్టార్ హీరో సల్మాన్​ఖాన్ విచ్చేశారు. ఈ సందర్భంగా సినిమా గురించి ఆశ్చర్యకర కామెంట్స్ చేశారు. 'ఆర్ఆర్ఆర్' రిలీజైన నాలుగు నెలల వరకు ఏ సినిమా విడుదల చేసే సాహసం చేయొద్దని సల్మాన్​ఖాన్ అన్నారు.

ఈ ఈవెంట్​కు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్​ జోహార్ హోస్టింగ్ చేశారు. కేవలం ఫ్యాన్స్​కు మాత్రమే అనుమతించిన ఈ కార్యక్రమాన్ని డిసెంబరు 31న స్టార్ ప్లస్​ ఛానెల్​లో ప్రసారం చేయనున్నారు.

salman khan RRR pre release event
ఆర్​ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్​లో సల్మాన్​ఖాన్

రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషించారు.

పాన్ ఇండియా స్థాయిలో జనవరి 7న రిలీజయ్యే ఈ సినిమాకు కీరవాణి సంగీతమందించారు. ఇప్పటికే వచ్చిన పాటలన్నీ.. శ్రోతల్ని అలరిస్తూ చిత్రంపై అంచనాల్ని పెంచుతున్నాయి. డీవీవీ దానయ్య రూ.450 కోట్లతో ఈ సినిమాను నిర్మించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.