ETV Bharat / sitara

'ఆర్‌ఆర్‌ఆర్‌' మాస్ సాంగ్‌.. 'నాటు' స్టెప్పులు నేర్చుకోండిలా! - ఆర్​ఆర్​ఆర్ చిత్రం రిలీజ్ డేట్

'ఆర్​ఆర్​ఆర్' చిత్రంలోని 'నాటు నాటు' సాంగ్ దుమ్మురేపుతోంది. ఎన్టీఆర్, రామ్​చరణ్.. తమ స్టెప్పులతో అదరగొట్టారు. మరి మీకూ తారక్, చరణ్​లా 'నాటు నాటు' పాటకు స్టెప్పులు వేయాలని ఉందా.. మరింకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసి నేర్చేసుకోండి.

rrr
ఆర్​ఆర్ఆర్
author img

By

Published : Nov 12, 2021, 2:26 PM IST

హోటల్స్‌, షాపింగ్‌ మాల్స్‌, సెలూన్స్‌.. ఇలా ఎక్కడా విన్నా.. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌.. ఇలా ఎందులో చూసినా 'నాటు నాటు' పాటే రిపీట్‌ అవుతోంది. సంగీతానికి తోడు రామ్‌ చరణ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ల డ్యాన్స్‌ మేనియా అలాంటిది మరి! ఈ ఇద్దరితో ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రంలోని గీతమిది. నవంబరు 10న విడుదలైంది. అతి తక్కువ సమయంలోనే రికార్డు సృష్టించింది. చరణ్‌, తారక్‌ కలిసి 'నాటు నాటు' అనే బీట్‌కి అదిరిపోయే స్టెప్పులేసి యావత్‌ సినీ అభిమానుల్ని ఉర్రూతలూగించారు. తమ వేగంతో అందరినీ ఆశ్చర్యపర్చారు.

కొందరు అభిమానులు వీరిని అనుకరించే ప్రయత్నం చేస్తున్నారు. సంబంధిత వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. మరికొందరికి డ్యాన్స్‌ చేయాలని ఉన్నా కాలు ఎలా కదపాలో తెలియక ఆగిపోతున్నారు. ఇలాంటి వారి కోసమే యూట్యూబ్‌ వేదికగా కొందరు పాఠాలు నేర్పుతున్నారు. 'నాటు నాటు హుక్‌ స్టెప్‌ ట్యుటోరియల్‌' పేరుతో వీడియోలు రూపొందించి వావ్‌ అనిపిస్తున్నారు. మీకూ ఈ 'నాటు' స్టెప్పు వేయాలని ఉందా? ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోలు చూసి నేర్చుకోండి.

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్​ఆర్​ఆర్' చిత్రం ప్రపంచవ్యాప్తంగా జనవరి 7న(rrr release date) విడుదల కానుంది. డీవీవీ దానయ్య.. దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్​తో నిర్మించారు. కల్పిత కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్​ పాత్రల్లో కనిపించనున్నారు.

ఆలియా భట్, ఒలీవియా మోరిస్ కథానాయికలు. అజయ్ దేవగణ్, సముద్రఖని, శ్రియ, రే స్టీవెన్​సన్, అలీసన్ డూడీ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: 'నాటు నాటు' పాట​లో క్యూట్ క్యూట్​ చిన్నది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.