దర్శకధీరుడు రాజమౌళి సినిమాల్లో కథతో పాటు పాటల్లోనూ ఓ వైవిధ్యం ఉంటుంది. కొత్తదనంతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకునేలా విజువల్స్ రూపొందించడంలో ఆయన దిట్ట. మరి ఇలా చేయడం వల్ల కథ కన్నా పాటలకే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందని అనుకున్నారేమో కాని... ప్రస్తుతం తెరకెక్కుతోన్న 'ఆర్ఆర్ఆర్'లో ఆ పద్ధతికి చెక్ పెట్టినట్లు సమాచారం.
ఈ కథలో భాగంగా మూడే పాటలు ఉంటాయట. వీటికి ఇప్పటికే బాణీలు సమకూర్చేపనిలో ఉన్నాడు కీరవాణి. వేర్వేరు ప్రాంతాలకు చెందిన ప్రముఖ విప్లవకారులు అల్లూరి, కొమరం భీంలను... ఒక్క కథాంశంతో వెండితెరపై ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నాడు జక్కన్న.
యువ కథానాయకులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మల్టీస్టారర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. సినిమా విడుదలయ్యే అన్ని దక్షిణాది, హిందీ భాషలకు తారక్ స్వయంగా డబ్బింగ్ చెప్పుకొనేందుకు రెడీ అవుతున్నాడట. అంతేకాకుండా ఓ సన్నివేశంలో నిజమైన పులితోనూ తలపడేందుకు ఎన్టీఆర్ సిద్ధమౌతున్నట్లు సమాచారం.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి...