యంగ్‌టైగర్ ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అటు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్.. డ్యాన్స్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఒకే పాటలో స్టెప్పులేస్తే.. ఇంకేముంది. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్సే.. అవును 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని ఓ పాటలో ఇద్దరూ కలిసి స్టెప్పులేశారు. ఈ పాటను నవంబరు 10న విడుదల చేయనుంది చిత్రబృందం. దీనికి సంబంధించి ఓ పోస్టర్‌ను సైతం విడుదల చేసింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli RRR movie) ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్'. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో (RRR Budget) 'ఆర్ఆర్ఆర్' (RRR release date) రూపొందిస్తున్నారు. అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్(Ramcharan RRR New Look ), కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ (Ntr RRR Poster) నటిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2022, జనవరి 7న విడుదల కానుంది.
ఇదీ చూడండి: RRR movie: ఆకట్టుకుంటున్న 'ఆర్ఆర్ఆర్' గ్లింప్స్