ETV Bharat / sitara

RRR Movie: బాహుబలిని మించి 'ఆర్​ఆర్​ఆర్​'.. తారక్​, చరణే ఎందుకంటే? - రామ్‌చరణ్‌

RRR Movie: మల్టీస్టారర్ మూవీ తీస్తే తన బాబాయ్​ బాలకృష్ణతో కలిసి ​చేస్తానని చెప్పారు ఎన్టీఆర్​. మహేశ్‌, బన్నీ, ప్రభాస్‌, చిరు, నాగార్జున, వెంకటేశ్​టో నటించేందుకు సిద్ధమన్నారు. 'బాహుబలి', 'బాహుబలి-2' కంటే 'RRR' మరింత గొప్పగా ఉండనుందని దర్శకుడు రాజమౌళి అన్నారు. మార్చి 25న 'RRR' విడుదల కానున్న తరుణంలో చిత్రబృందం ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించింది.

RRR Movie
తారక్​-రాజమౌళి- రామ్​చరణ్​
author img

By

Published : Mar 15, 2022, 7:50 PM IST

RRR Movie: తెలుగు చిత్రపరిశ్రమ ఖ్యాతిని పెంచిన 'బాహుబలి', 'బాహుబలి-2' కంటే 'RRR' మరింత గొప్పగా ఉండనుందని ప్రముఖ దర్శకుడు రాజమౌళి అన్నారు. మార్చి 25న 'RRR' విడుదల కానున్న తరుణంలో చిత్రబృందం ప్రత్యేకంగా మీడియా సమావేశం నిర్వహించింది. సినిమా చిత్రీకరణ, ఇద్దరు హీరోల పాత్రలు, బడ్జెట్‌ విశేషాలు.. ఇలా ఎన్నో విషయాలపై రామ్‌చరణ్‌(Ram charan), రాజమౌళి(Rajamouli), తారక్‌(NTR) తమ మనసులోని మాటలు బయటపెట్టారు. ఇంతకీ ఈ ముగ్గురు పంచుకున్న సరదా ముచ్చట్లు మీకోసం..

RRR Movie
మీడియా సమావేశంలో హీరోలు

రామ్‌చరణ్‌, తారక్‌లనే ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏమిటి? ఉక్రెయిన్‌లో షూట్‌ ఎలా జరిగింది?

రాజమౌళి: రామ్‌చరణ్‌, తారక్‌లను ఈ కథ కోసం ఎంచుకోవడానికి మొదటి కారణం వాళ్లకి ఉన్న స్టార్‌డమ్‌, వ్యక్తిత్వం, టాలెంట్‌. నేను రాసుకున్న అల్లూరి సీతారామరాజు, కొమురంభీమ్‌ పాత్రలకు వాళ్లు మాత్రమే సరిగ్గా న్యాయం చేయగలరని భావించా. అందుకే వాళ్లనే తీసుకున్నాను. అదీ కాక, రామ్‌చరణ్‌-తారక్‌ ఈ సినిమా నుంచే స్నేహితులయ్యారని అందరూ అనుకుంటున్నారు. అది నిజం కాదు. వాళ్లు ఎంతోకాలం నుంచి మంచి స్నేహితులు. ఇది కూడా ఒక కారణం.

రాజమౌళి: ఉక్రెయిన్‌లో షూటింగ్‌ ఓ అద్భుతమైన అనుభవాన్ని అందించింది. షూటింగ్‌ చేసిన సమయంలో అక్కడ రాజకీయంగా పరిస్థితులు బాగోలేదని మాకు తెలియదు. అక్కడి నుంచి తిరిగి వచ్చేశాక.. "అక్కడికి ఎలా వెళ్లారు. అక్కడ పరిస్థితులు బాగోలేదు కదా" అని స్నేహితులు అడగటం ప్రారంభించారు. షూటింగ్‌ జరిగినన్ని రోజులు మాకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలయ్యాక.. తెలిసిన వాళ్లకి మెస్సేజ్‌లు పెట్టాను. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాను. పరిస్థితులు త్వరగా చక్కబడి, సాధారణ స్థితికి రావాలని కోరుకుంటున్నా.

తారక్‌: నాటునాటు సాంగ్‌ని మేము ఉక్రెయిన్‌లో షూట్‌ చేశాం. సాంగ్‌ చాలా అద్భుతంగా వచ్చింది. స్క్రీన్‌పై మీరు ఆ మ్యాజిక్‌ చూస్తారు. ఉక్రెయిన్‌ ప్రజలు ఫ్రెండ్లీగా ఉంటారు. ఏదైనా సరే నేర్చుకోవాలనే పట్టుదల అక్కడి ప్రజల్లో ఎక్కువగా ఉంటుంది. వాళ్ల ఆహార అభిరుచులు, సంస్కృతి, ఎదుటివ్యక్తుల్ని స్వాగతించే విధానం.. ఇలా ప్రతీది మాకెంతో నచ్చింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు త్వరితగతిన సద్దుమణగాలని కోరుకుంటున్నా.

రామ్‌చరణ్‌: షూట్‌ కోసం ఉక్రెయిన్‌కు వెళ్లినప్పుడు ఆ ప్రాంతం గురించి మాకు చాలా తక్కువ తెలుసు. అక్కడికి వెళ్లాక.. అది ఒక అద్భుతమైన దేశంగా అనిపించింది. అక్కడివాళ్లు మంచి మనసున్న వారు. షూట్‌ సమయంలో నా భద్రత కోసం పనిచేసిన ఓ వ్యక్తికి ఇటీవల మెస్సేజ్‌ చేశా. 85 ఏళ్ల తన తండ్రి కూడా గన్‌ చేతపట్టుకుని దేశం కోసం పోరాటం చేస్తున్నాడంటూ ఆ వ్యక్తి చెప్పిన మాటలు విని బాధగా అనిపించింది. సాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ల ఖాతాల్లోకి డబ్బు జమ చేశా.

RRR Movie
తారక్​-రాజమౌళి- రామ్​చరణ్​

'ఆర్‌ఆర్‌ఆర్‌'కి మీరు మొదట అనుకున్న టైటిల్‌ ఏమిటి?

రాజమౌళి: సినిమా ప్రారంభించిన సమయంలో మేము ఎలాంటి టైటిల్‌ అనుకోలేదు. మా ముగ్గురుని దృష్టిలో ఉంచుకుని 'RRR' అని ప్రారంభించాం. ఫ్యాన్స్‌కి అది బాగా నచ్చేసింది. వాళ్లే ఈ టైటిల్‌ డిసైడ్‌ అయిపోయారు. మేము కూడా ఫిక్స్‌ చేసేశాం. 'RRR' కాకుండా మేము ఎలాంటి పేర్లు పరిశీలించలేదు.

మీ మధ్య ఉన్న స్నేహం ఈ పాత్రలకు ఎంతలా ఉపయోగపడింది?

తారక్‌: ప్రతి నటుడికి ఒక బలం, బలహీనత ఉంటుంది. అది దర్శకుడికి మాత్రమే తెలుస్తుంది. మా స్నేహం ఈ పాత్రలకు ఎంతలా ఉపయోగపడిందో తెలియదు కానీ, మా స్నేహం మరింత బలోపేతం కావడానికి ఆ పాత్రలు ఎంతగానో ఉపయోగపడ్డాయి.

భీమ్‌ పాత్రకు తారక్‌ని, రామ్‌ పాత్రకు చరణ్‌ని ఎంచుకోవడానికి ప్రధాన కారణమేమిటి?

రాజమౌళి: మేము రాసుకున్న పాత్రలు చూసుకుంటే.. రామ్‌ అనే పాత్ర ఎంత అగ్నినైనా గుండెల్లో దాచుకునే స్థితప్రజ్ఞత కలిగిన వ్యక్తి. అది చరణ్‌లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎలాంటి కష్టం, సుఖం వచ్చినా తొణకడు స్థిరంగా ఉంటాడు. అందుకే ఆ పాత్ర చరణ్‌కు ఇచ్చా. ఇక, భీమ్‌ పాత్ర ఎంతో అమాయకమైన వ్యక్తి. ఫీలింగ్స్‌ని దాచుకోలేడు. అందుకే ఆ పాత్ర తారక్‌కు ఇచ్చా.

RRR Movie
ఆర్ఆర్​ఆర్​ పోస్టర్​

మీ సినిమాలంటే ఆయా హీరో అభిమానులకు పండుగే. మరి, 'ఆర్‌ఆర్‌ఆర్‌' విజువల్‌ ట్రీట్‌ ఎలా ఉండనుందని భావిస్తున్నారు?

రాజమౌళి: ఇదొక డబుల్‌ బొనాంజ

సెట్స్‌లో బెస్ట్‌ మూమెంట్‌ ఏదైనా ఉందా?

తారక్‌: 'RRR'.. ప్రతి రోజూ ఒక అందమైన జ్ఞాపకాన్ని అందించింది. షూట్‌ ప్రారంభమైన నాటి నుంచి రోజూ ఏదో ఒక కొత్తవిషయం నేర్చుకున్నా. బెస్ట్‌ మూమెంట్‌ కాదు కానీ, బెస్ట్‌ ఎపిసోడ్‌ అయితే.. విరామ సన్నివేశాల కోసం దాదాపు 60 రోజులు కష్టపడి షూట్‌ చేశాం. అప్పటివరకూ చూసిన సినిమా అంతా ఆ పాయింట్‌కి వచ్చి ఆగుతుంది. కథ చెప్పినప్పుడే ఆ పాయింట్‌ విని నాలో ఉత్సుకత పెరిగింది. అలాంటి కీలకమైన పాయింట్‌ని షూట్‌ చేయడం సులభమైన విషయం కాదు. ఎంతో కష్టతరం. అది షూట్‌ చేసిన రోజులు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

సినిమా విడుదల ఎన్నోసార్లు వాయిదా పడింది కదా. మీరు ఒత్తిడికి లోనయ్యారా?

చరణ్‌: కరోనా కారణంగా అందరి సినిమాలు వాయిదా పడుతూ ఉన్నాయి. దానివల్ల ఎలాంటి ఒత్తిడికి లోనవలేదు. అంతేకాకుండా 'RRR' ఎప్పుడు వచ్చినా ప్రేక్షకులు తప్పకుండా అదే ఫీల్‌తో చూస్తారనే నమ్మకం ఉంది. కాబట్టి అస్సలు టెన్షన్‌ పడలేదు.

'ఆర్‌ఆర్‌ఆర్‌' కోసం మీరు ప్రత్యేకంగా ఏదైనా శిక్షణ తీసుకున్నారా?

చరణ్‌: అలా ఏమీ చేయలేదు. కొన్నిరోజుల పాటు మేము పోషించనున్న పాత్రలు, వాటి స్వభావాల గురించి తెలుసుకునేందుకు సమయం కేటాయించాం. ఎందుకంటే రాజమౌళికి తాను రాసుకున్న పాత్రలపై పూర్తి అవగాహన ఉంది. ఆయన ఎలా చేయమంటే మేము అలా చేశాం.

ఇద్దరు స్టార్స్‌ని ఒకే ఫ్రేమ్‌లో చూపించడం కోసం ఏదైనా జాగ్రత్తలు పాటించారా?

రాజమౌళి: ఇద్దరు హీరోలపై ప్రేక్షకులకు ఒకరకమైన ఫీలింగ్ రావాలి. వాళ్లు అలా ఫీల్‌ కాకపోతే నా కథ ఫెయిల్‌ అయినట్టే. అందుకే ఎమోషన్స్‌పై ఎక్కువగా దృష్టి పెట్టా.

తారక్‌: మా అభిమానులు కూడా సిద్ధమైపోయారు. కేవలం ఎన్టీఆర్‌, లేదా చరణ్‌ని కాదు.. ఇద్దర్నీ చూడనున్నాం.

RRR Movie
ఆర్​ఆర్​ఆర్​ చిత్ర యూనిట్​

ఇద్దరు హీరోలతోనే కాకుండా నలుగురు, ఐదుగురు హీరోలతో సినిమా చేసే ఉద్దేశం ఉందని చెప్పారు?

రాజమౌళి: ప్రస్తుతం అలాంటి వర్క్ చేయడం లేదు. నాకు ఎన్నో ఆలోచనలు ఉంటాయి. నా వద్ద ఎన్నో కథలు ఉంటాయి. ఒక సినిమా చేస్తున్నంతసేపు నా దృష్టి మొత్తం ఆ హీరోలు, ఆ సినిమాపైనే ఉంటుంది.

మధ్యలో తారక్‌ అందుకుని 'మీరు ప్రశ్న తప్పుగా అడిగారండి. ఇంకో ఐదుగురు హీరోలతో సినిమా చేస్తే అందులో వీరిద్దరూ ఉన్నారా?' అని అడగాలి.. అంటూనే నాకు తెలిసి మేమిద్దరం గ్యారెంటీ మిగతా ముగ్గురు ఎవరు అనేది ఆయనే చెప్పాలి(నవ్వులు)

కరోనా కారణంగా సినిమా బడ్జెట్‌ పెరిగిందా? సినిమా చేస్తున్న సయమంలో మీరు ఎప్పుడైనా భయపడ్డారా?

రాజమౌళి: కరోనా కారణంగా బడ్జెట్‌ కాస్త ఎక్కువ పెరిగింది. కరోనా సమయంలో వచ్చిన బ్రేక్స్‌ వల్ల 3డీ వెర్షన్‌ మరింత మెరుగు పరుచుకునేందుకు సాధ్యమైంది. సాధారణంగా నేను 3డీ వెర్షన్‌కి వ్యతిరేకిని. కానీ 3డీ ఫైనల్‌ కాపీ చూశాక.. నేనెంతో హ్యాపీగా ఫీలయ్యా. ఎంతో భావోద్వేగానికి లోనయ్యా. నా మనసులో ఉన్న కథను విజువల్‌గా చూపించగలనా? లేదా? అనే విషయంలో ఒక దర్శకుడిగా ఈ సినిమాకే కాదు ఏ సినిమాకైనా భయపడుతూనే ఉంటాను. ఆ భయమే నన్ను నడిపిస్తుంది.

RRR Movie
కొమురం భీం పాత్రలో తారక్

స్క్రిప్ట్‌పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

రాజమౌళి: ముందు నుంచి చెబుతున్నా.. ఇది బయోపిక్‌ కాదు. ఫిక్షనల్. పాత్రలు, సంఘటనలు.. అన్నీ కల్పితంగా చూపించినవే.

భారీ బడ్జెట్‌ సినిమాల జోలికి వెళ్లనని 'మగధీర' సమయంలో మీరు చెప్పారు. మరి, మీరు మైండ్‌ ఎందుకు చేంజ్‌ చేసుకున్నారు?

రాజమౌళి: రాంగోపాల్‌ వర్మ నుంచి స్ఫూర్తి తీసుకుని ఒక అబద్ధం చెప్పాననుకోండి(నవ్వులు)

సీక్వెల్‌ ఏమైనా ప్లాన్‌ చేస్తున్నారా?

రాజమౌళి: లేదు. 'RRR' సింగిల్‌ మూవీ

సినిమాలో పనిచేసిన వాళ్లకి కాకుండా బయటవాళ్లకి సినిమా చూపించారా?

తారక్‌: మాకు కూడా సినిమా చూపించలేదు.

'ఆర్‌ఆర్‌ఆర్‌' కోసం వర్క్‌ చేస్తున్న సమయంలో అమ్మ బాబోయ్‌ అనిపించిన రోజు ఏదైనా ఉందా?

తారక్‌: ప్రతి రోజూ అమ్మ బాబోయ్‌ అనిపించింది.

ఈ టీమ్‌లో నిజమైన ట్రబుల్‌ మేకర్‌ ఎవరు?

రాజమౌళి: తారక్‌ (నవ్వులు)

'బాహుబలి', 'బాహుబలి-2' కంటే 'ఆర్‌ఆర్‌ఆర్‌' మరింత గొప్పగా ఉండనుందా?

రాజమౌళి: తప్పకుండా

RRR Movie
సీత పాత్రలో ఆలియా భట్​

ఆలియాభట్‌ని సీత పాత్ర కోసం ఎంచుకోవడానికి కారణం?

రాజమౌళి: లుక్స్‌, లేదా శరీరఛాయ.. ఇలాంటి వాటిని చూసి ఆమెను ఈ పాత్ర కోసం ఎంచుకోలేదు. మేము రాసుకున్న సీత పాత్రలో.. అమ్మాయి ముఖం చూడగానే సాయం చేయాలనే అమాయకత్వం కనిపించాలి. అదే విధంగా నీరు, నిప్పు అనే ఇద్దరు వ్యక్తులను కంట్రోల్‌ చేయగలిగే మనోధైర్యం ఉండాలి. ఇవన్నీ ఆలియాలో ఉన్నాయి. అందుకే ఆమెను ఎంచుకున్నా.

ఇదే కథ వేరే దర్శకుడు చేస్తే మీరు భాగం అవుతారా?

తారక్‌: లేదు. ఎందుకంటే ఇలాంటి కథ రాసే సాహసం కూడా వేరే దర్శకుడికి రాకపోవచ్చు. ఒకటి మాత్రం చెప్పగలను ఇకపై అన్నీ మల్టీస్టారర్‌ సినిమాలు వస్తూనే ఉంటాయి.

చరణ్‌: ఆలోచించడం కూడా చాలా కష్టం.

ఇటీవల సినిమా విడుదల దృష్టిలో ఉంచుకుని ప్రమోషన్స్‌ బాగా చేశారు. తీరా చూస్తే వాయిదా పడింది. అప్పుడు మీరు ఎలా ఫీల్‌ అయ్యారు?

తారక్‌: చాలా బాధగా అనిపించింది. అభిమానులతో కలిసి ఈ సినిమా చూడాలని మాకూ ఉంది. అది మిస్‌ అయ్యామని బాధగా అనిపించింది.

RRR Movie
అల్లూరి పాత్రలో రామ్​చరణ్​

'ఆర్‌ఆర్‌ఆర్‌' ఎలాంటి బెంచ్‌ మార్క్ క్రియేట్‌ చేయనుంది?

రాజమౌళి: 20 ఏళ్ల కెరీర్‌లో నా సినిమా ఇన్ని రికార్డ్స్‌ క్రియేట్‌ చేస్తుందని ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు కూడా చెప్పను. మంచి సినిమా చేశాం. మీరు తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారు. భావోద్వేగానికి గురవుతారు.

అజయ్‌దేవ్‌గణ్‌, ఆలియాతో వర్క్ చేయడం ఎలా ఉంది?

తారక్‌: అజయ్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకునే ఛాన్స్‌‌ రాలేదు. ఆలియాతో కలిసి వర్క్ చేయడం ఒక ఎక్స్‌పోలో ఉన్నట్లు ఉంది. ఎన్నో విషయాల గురించి మాట్లాడుకునేవాళ్లం. వర్కింగ్‌ స్టైల్స్‌, సినిమాల చిత్రీకరణ.. ఇలా ఎన్నో విషయాలు సరదాగా మాట్లాడుకునే వాళ్లం. దాని వల్ల మా మధ్య స్నేహబంధం పెరిగింది.

మల్టీస్టారర్స్‌ చేస్తారా?

తారక్‌: బలమైన కథలు వస్తే.. దర్శకుడు తప్పకుండా చేయగలడనే నమ్మకం కలిగితే తప్పకుండా ఓకే చేస్తా.

ఎవరితో మల్టీస్టారర్‌ చేయాలని ఉంది?

తారక్‌: మహేశ్‌, బన్నీ, ప్రభాస్‌, చిరు, నాగార్జున బాలా బాబాయ్‌, వెంకటేశ్‌.. అందరితో కలిసి చేద్దాం.

ముందురోజు ప్రీమియర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారని తెలిసింది?

రాజమౌళి: అది డిస్టిబ్యూటర్స్‌ చూసుకోవాలి.

కీరవాణి లిరిక్స్‌ రాశారు కదా?

రాజమౌళి: ఆయన ఎప్పటి నుంచో రాస్తున్నారు. కంపోజ్‌ చేసే సమయంలోనే తనకు వచ్చిన లిరిక్స్‌ని పాటలా రాస్తుంటారు. అందువల్ల పాటల్లో ఒక సహజమైన ఫ్లేవర్‌ ఉంటుంది. అది నాకు బాగా నచ్చుతుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చదవండి: RRR in 3D: 3డీలో 'ఆర్​ఆర్​ఆర్'​.. ప్రేక్షకులకు రాజమౌళి సర్​ప్రైజ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.