ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అభిమానులకు 'ఆర్ఆర్ఆర్' టీమ్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. క్లైమాక్స్ షూటింగ్ మొదలైనట్లు మంగళవారం ట్వీట్ చేసింది. భీమ్-సీతారామరాజు ఒకరి చేతులు ఒకరు మోచేయి వరకు పట్టుకున్న ఫొటోను ట్వీట్ చేసింది. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
ఈ పాన్ ఇండియా సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, జూ.ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన వారి పాత్రల టీజర్స్ రికార్డులను సృష్టిస్తూ ముందుకు సాగుతున్నాయి. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. శ్రియ, సముద్రఖని, అజయ్ దేవ్‌గణ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతమందిస్తున్నారు. డీవీవీ దానయ్య, దాదాపు రూ.350 కోట్లతో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది థియేటర్లలోకి 'ఆర్ఆర్ఆర్' వచ్చే అవకాశముంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: