ETV Bharat / sitara

RRR movie: ఒక్క ఫొటో.. నాలుగేళ్ల ప్రయాణం.. సాగిందిలా - ఆర్​ఆర్​ఆర్​ సినిమా రిలీజ్​ డేట్స్​

RRR movie 4 years journey: కరోనా, లాక్​డౌన్​, టికెట్​ రేట్ల సమస్యలు, చిత్రబృందం వైరస్​ బారిన పడటం, హీరోలకు గాయాలు అవ్వడం, వాయిదాల పర్వం ఇలా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఎట్టకేలకు అభిమానుల్ని అలరించేందుకు సిద్ధమైంది 'ఆర్​ఆర్​ఆర్'. ఒక్క ఫొటోతో మొదలై నాలుగేళ్ల పాటు ఈ చిత్రబృందం ప్రయాణం సాగింది. ​ఆ జర్నీ సమాహారమే ఈ కథనం..

RRR 4 years journey
ఆర్​ఆర్​ఆర్​ జర్నీ
author img

By

Published : Mar 22, 2022, 5:36 PM IST

Updated : Mar 22, 2022, 6:33 PM IST

RRR movie 4 years journey: సినీప్రియులు ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న సినిమా 'ఆర్​ఆర్​ఆర్'​. ఎన్టీఆర్​, రామ్​చరణ్​ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లపై సందడి చేయనుంది. దాదాపు రూ.450కోట్ల భారీ బడ్జెట్​తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ పాన్​ ఇండియా చిత్రం ఒక్క ఫొటోతో మొదలై, దాదాపు నాలుగేళ్ల పాటు ప్రయాణం సాగింది. ఆ ప్రయాణం గురించి ఓ సారి చూద్దాం...

rrr
జక్కన్న తారక్​ చరణ్​..

ఒక్క ఫొటోతో మొదలై.. నెట్టింట్లో వైరలై

  • 2017 నవంబరు 18న ఎన్టీఆర్​, రామ్​చరణ్​తో కలిసి దిగిన ఫొటోను రాజమౌళి ట్వీట్​ చేశారు. కొన్ని డాట్స్​తో పాటు ఓ ఎమోజీని క్యాప్షన్​ జోడించారు. ఈ ఫొటో సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. దీంతో ఈ ముగ్గురి కాంబోలో సినిమా రాబోతున్నట్లు అప్పట్లో తెగ చర్చనీయాంశమైంది.
  • 2018 మార్చి 22 సస్పెన్స్​ వీడింది. చరణ్, తారక్​తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు రాజమౌళి. ముగ్గురు పేర్లలోని ఆర్​ను కామన్​గా తీసుకుని #RRR అనే హ్యాష్​ట్యాగ్​ ఫుల్​ ట్రెండ్​ అయింది.
  • 2018 నవంబర్ 11న అల్యుమిలియం ఫ్యాక్టరీలో పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. నటులు చిరంజీవి, ప్రభాస్‌, రానా, దర్శకులు రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను, వి. వి. వినాయక్‌ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
  • 2018 నవంబర్ 19న రెగ్యులర్​ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. హైదరాబాద్‌, గుజరాత్‌, పుణె, ఉక్రెయిన్‌ తదితర ప్రాంతాల్లో ఈ సినిమాను చిత్రీకరించారు.
  • 2019 మార్చి 14న రాజమౌళి, తారక్, చరణ్ మీడియా సమావేశం. #RRR కొమురంభీమ్, అల్లూరి సీతారామరాజుల జీవితాల ఆధారంగా కల్పిత కథతో సినిమా చేస్తున్నట్లు వెల్లడి. 2020 జులై 30న విడుదల చేస్తున్నట్లు ప్రకటన.
  • 2019 మార్చి 18న 'ఆర్‌ఆర్‌ఆర్‌' అని వచ్చేలా ఓ టైటిల్​ను తెలపాలి అంటూ ప్రేక్షకులను కోరింది మూవీ టీమ్​.
  • ఎన్టీఆర్‌ సరసన హాలీవుడ్‌ భామ ఒలివియా మోరిస్‌, విలన్‌ పాత్రల్లో రే స్టీవెన్‌సన్‌, అలిసన్‌ డూడీ నటిస్తున్నారని 2019 నవంబరు 19న చిత్ర బృందం తెలియజేసింది.
    RRR
    ఆర్​ఆర్​ఆర్​
  • 2020 మార్చి 25న 'రౌద్రం రణం రుధిరం'. (Rise Roar Revolt) టైటిల్‌ ఖరారు చేస్తూ మోషన్​ పోస్టర్​ను విడుదల చేసింది. ఇప్పుడు మార్చి 25నే సినిమా విడుదలవుతుండటం విశేషం.
  • 2020 మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా భీమ్ ఫర్ రామరాజు- రామరాజు ఇంట్రో వీడియో విడుదలైంది. ఇది అందరినీ కట్టిపడేసింది. అల్లూరి సీతారామరాజు గెటప్‌లో చరణ్​ కనిపించడం, ఆయన పోరాట పటిమ గురించి ఎన్టీఆర్‌ (కొమురం భీమ్‌) చెప్పడం వల్ల ఈ వీడియో విడుదలైన అనతి కాలంలోనే కోట్ల వ్యూస్‌ సాధించింది.
  • అనంతరం కరోనా కారణంగా షూటింగ్ వాయిదా
  • 2020 అక్టోబర్ 6న మళ్లీ షూట్ ప్రారంభమైంది
  • 2020 అక్టోబర్ 22న ఎన్టీఆర్ కొమురంభీమ్ పాత్రను పరిచయం చేస్తూ రామరాజు ఫర్ భీమ్- భీమ్ ఇంట్రో వీడియో విడుదలైంది. ఇది కూడా ఫ్యాన్స్​ను తెగ ఆకర్షించింది. సినిమాపై అంచనాలను పెంచేసింది.
  • 2021 జులై 15న 'రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్' వీడియో విడుదల
  • 2021 ఆగస్టు 1న 'దోస్తి' పాట విడుదలై అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.
  • 2021 నవంబర్ నిమిషం 45 సెకన్లతో కూడిన గ్లిమ్స్ విడుదల
  • 2021 నవంబర్ 10న 'నాటు నాటు' సాంగ్​
  • 2021 నవంబర్ 26న 'జనని' పాట
  • 2021 డిసెంబర్ 9న 'ఆర్​ఆర్​ఆర్​' ట్రైలర్
  • 2021 డిసెంబర్ 24న 'కొమురంభీముడో' గీతం
    • " class="align-text-top noRightClick twitterSection" data="">

విడుదల తేదీ మారుతూ..

RRR release dates postpone: అనుకున్న సమయానికి అన్ని కార్యక్రమాలు పూర్తవకపోవడం, కరోనా, టికెట్ రేట్ల సమస్యలు తదితర కారణాల వల్ల చిత్ర బృందం విడుదల తేదీని మారుస్తూ వచ్చింది. ఆ వివరాలు

  • మొదట ప్రకటించిన తేది - 2020 జులై 30, 2020
  • రెండో సారి 2021 జనవరి 8
  • మూడో సారి 2021 అక్టోబర్ 13
  • నాలుగో సారి 2022 జనవరి 7
  • ఐదో సారి 2022 మార్చి 18 లేదా ఏప్రిల్ 28
  • ఆరోసారి 2022 మార్చి 25
  • రెండేళ్ల కిందట టైటిల్ ఏ రోజు అయితే ప్రకటించారో అదే తేదీకి మార్చి 25న సినిమా విడుదల అవుతుండటం విశేషం.

ఎన్నో సవాళ్లు

  • ఈ 'ఆర్​ఆర్​ఆర్' ప్రయాణంలో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌, రాజమౌళితో సహా చిత్ర బృందంలోని పలువురు కరోనా బారినపడ్డారు.
  • వ్యాయామం చేస్తుండగా రామ్‌చరణ్‌కు గాయమైంది. దాంతో యాక్షన్‌ సన్నివేశాల షెడ్యూల్‌ కొన్ని వారాలపాటు వాయిదా పడింది.
  • 'దోస్తీ' పాటను రచించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం చిత్ర బందాన్ని కలచివేసింది.
  • ఇలా ఎన్నో సవాళ్లు దాటుకొని.. కొమురం భీమ్​, అల్లూరిసీతరామారాజు తమ 'దోస్తీ'తో మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఇదీ చూడండి: 'ఆర్​ఆర్​ఆర్​'కు కలిసొచ్చే అంశాలివే.. రూ.3వేల కోట్లు పక్కా!

Last Updated : Mar 22, 2022, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.