Prabhas Project K: 'ప్రాజెక్ట్ కె' సినిమా పనుల్లో భాగంగా ఆదివారం మహీంద్రా రీసెర్చ్ వ్యాలీకి వెళ్లారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఈ సందర్భంగా.. "సాంకేతికతను ప్రకృతి కలిసే చోటు" అంటూ ఆ క్యాంపస్‌ను కొనియాడారు. ఇటీవలే ఈ చిత్రానికి సాంకేతిక సహకారం కావాలని నాగ్ అశ్విన్ కోరగా.. అందుకు సంతోషంగా అంగీకరించారు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్ర. ఈ క్రమంలోనే ఆయన మహీంద్రా క్యాంపస్‌కు వెళ్లారు. ఈ సినిమాను దేశానికి గర్వకారణంగా నిలిచేలా రూపొందిస్తానన్న తన మాట నిలబెట్టుకునేందుకు ఎంతో ఉత్సాహంతో పనిచేస్తానని నాగ్ అశ్విన్ అన్నారు.
-
What a beautiful campus, where nature meets cutting edge tech...a fruitful start to our journey with @Velu_Mahindra and team..thank you so much @anandmahindra sir. This promises to be v exciting.🙏 #mahindraresearchvalley #projectk pic.twitter.com/FH7kJ8VP53
— Nag Ashwin (@nagashwin7) March 13, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">What a beautiful campus, where nature meets cutting edge tech...a fruitful start to our journey with @Velu_Mahindra and team..thank you so much @anandmahindra sir. This promises to be v exciting.🙏 #mahindraresearchvalley #projectk pic.twitter.com/FH7kJ8VP53
— Nag Ashwin (@nagashwin7) March 13, 2022What a beautiful campus, where nature meets cutting edge tech...a fruitful start to our journey with @Velu_Mahindra and team..thank you so much @anandmahindra sir. This promises to be v exciting.🙏 #mahindraresearchvalley #projectk pic.twitter.com/FH7kJ8VP53
— Nag Ashwin (@nagashwin7) March 13, 2022
'ప్రాజెక్ట్ కె'లో ప్రభాస్ సూపర్‌హీరో రోల్‌లో కనిపించనున్నట్లు సమాచారం. దీపికా పదుకొణె హీరోయిన్. అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
డాల్బీలో 'ఆర్ఆర్ఆర్'
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్'.. మరో ప్రత్యేకతను సంతరించుకుంది. డాల్బీ సినిమాలో రిలీజ్‌కానున్న తొలి భారతీయ చిత్రంగా నిలవనుంది. డాల్బీ సాంకేతికతతో మంచి విజువల్ సహా అద్భుతమైన సౌండ్‌ను ప్రేక్షకుడు అనుభూతి చెందుతాడు. మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది.
![rrr release date](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14722401_2.jpg)
రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య నిర్మాత.
మహేశ్ చేతుల మీదుగా..
![mishan impossible telugu movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14722401_1.jpg)
'ఏజెంట్ సాయిశ్రీనివాస్ ఆత్రేయ' సినిమాతో గుర్తింపు దక్కించుకున్న యువ దర్శకుడు స్వరూప్ ఆర్ఎస్జే దర్వకత్వంలో 'మిషన్ ఇంపాజిబుల్' అనే చిత్రం తెరకెక్కనుంది. తాప్సీ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్ర ట్రైలర్‌ను మార్చి 15న సూపర్‌స్టార్ మహేశ్‌బాబు రిలీజ్ చేయనున్నారు.
రోషన్.. క్రేజీ ఛాన్స్..
![roshan meka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14722401_4.jpg)
నటుడు శ్రీకాంత్ కుమారుడు, యువ హీరో రోషన్.. బంపర్ ఆఫర్ కొట్టేశాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌లో ఓ సినిమా చేయనున్నాడు. అందుకు సంబంధించిన ప్రకటనతో ఆదివారం (మార్చి 13) రోషన్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించనున్నారు.
'రాధేశ్యామ్' రెండో రోజు కలెక్షన్లు..
![radhe shyam collection day 2](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14722401_3.jpg)
పాన్ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా కలెక్షన్లలో దూసుకుపోతోంది. మంచి ప్రేమ కథతో పాటు అద్భుతమైన విజువల్స్‌తో తెరకెక్కిన్న ఈ సినిమా మార్చి 11న విడుదలైంది. తొలి రోజు రూ.79 కోట్లు వసూలు చేసిన 'రాధేశ్యామ్' కలెక్షన్లు.. రెండో రోజుకు రూ.119 కోట్లకు (గ్రాస్) చేరుకున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
'రాధేశ్యామ్' నుంచి ఆదివారం 'నిన్నేలే' అనే వీడియో సాంగ్‌ను రిలీజ్ చేసింది చిత్రబృందం. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా నటించారు ప్రభాస్. దాదాపు రూ.300 కోట్ల బడ్జెట్‌తో యు.వి.క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించింది. రాజమౌళి ఈ సినిమాకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. జస్టిన్ ప్రభాకరన్ పాటలు స్వరపరచగా, తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించారు.
ఇదీ చూడండి: కశ్మీరీ పండిట్ల కన్నీటి గాథ.. 'ది కశ్మీర్ ఫైల్స్'