ఎన్టీఆర్ (NTR), రామ్‌చరణ్ (Ram charan) హీరోలుగా రాజమౌళి (Rajamouli) తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'(RRR). ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉంది. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన 'ఆర్ఆర్‌ఆర్' ఫస్ట్ గ్లింప్స్‌కు విశేష స్పందన వచ్చింది. ఈ క్రమంలో దర్శకుడు రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'లోని ఓ డైలాగ్‌ను రివీల్ చేశారు. ప్రస్తుతం ఇది సామాజిక మాధ్యమాల వేదికగా ట్రెండ్ అవుతోంది.
సోమవారం హైదరాబాద్‌లోని ఛాయిస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో క్రికెటర్ కపిల్‌దేవ్, దర్శకుడు రాజమౌళి, వైద్యులు రవి తంగరాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. 'నిర్మాత శోభు యార్లగడ్డ ద్వారా ఛాయిస్ ఫౌండేషన్ సతీశ్ పరిచయం అయ్యారు. పిల్లల్లో కలిగే 90శాతం సమస్యలకు పరిష్కారాలున్నాయి. ఛాయిస్ ఫౌండేషన్ పిల్లల కోసం ఎన్నో రోజులుగా కష్టపడుతోంది' అని అన్నారు. చిన్నారుల కోసం పనిచేస్తున్న ఈ సంస్థ 2 కోట్ల రూపాయల చెక్‌ను మాస్ మ్యుచవల్ ఫండ్ తరపున రవి తంగిరాల అందించారు. ఈ క్రమంలో 'ఆర్ఆర్ఆర్'లోని ఓ డైలాగ్‌ను రాజమౌళి చెప్పారు.
"యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి. అది ధర్మయుద్ధమైతే విజయం తథ్యం" అని రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'లోని డైలాగ్ చెప్పారు. మరి ఈ డైలాగ్ సినిమాలో ఎవరు? ఎవరితో అన్నారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే! ప్రస్తుతం ఈ డైలాగ్ సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది.
డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఆలియా భట్, అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్వాతంత్ర్య సంగ్రామ సమయంలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ కలిస్తే ఏం జరిగిందన్న పాయింట్‌కు ఫిక్షనల్ స్టోరీ జోడించి 'ఆర్ఆర్ఆర్' తీస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: