'ఆర్ఆర్ఆర్'లో అల్లూరి సీతారామరాజు-కొమరం భీమ్ పాత్రలతో తలపడే విలన్ పాత్రధారి వచ్చేసింది. లేడీ స్కాట్‌గా కనిపించనున్న ఐరిష్ నటి అలీసన్ డూడీ.. భారత్‌కు వస్తున్నట్లు ఇన్‌స్టాలో ఆదివారం ఓ వీడియోను పోస్ట్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేసింది.
- View this post on Instagram
Lady Scott heading to India 🎬 🔥🌊 #rrrmovie #rrr #ssrajamouli #film @ssrajamouli
">
కొద్దిరోజులు క్వారంటైన్లో ఉండనున్న ఈమె.. ఆ తర్వాత చిత్రీకరణలో పాల్గొనే అవకాశముంది. దాదాపు ఏడు నెలల విరామం తర్వాత ఇటీవలే షూటింగ్ ప్రారంభమైంది. ఆ వీడియోను చిత్రబృందం సోషల్ మీడియాలోనూ పంచుకుంది. గతనెల 22 కొమరం భీమ్ జయంతి సందర్భంగా తారక్ టీజర్‌ను కూడా విడుదల చేశారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
రూ. 350 కోట్ల పైచిలుకు బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఒలీవియా మోరిస్, రే స్టీవెన్సన్, అజయ్ దేవగణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్ర పోషిస్తున్నారు. కీరవాణి సంగీత దర్శకుడు. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రేక్షకులు ముందుకు రానుందీ సినిమా.
తెలుగమ్మాయికి ఛాన్స్!
'ఆర్ఆర్ఆర్' సినిమాలో హీరోయిన్ల పాత్రలతో పాటు భీమ్‌ను ప్రేమించే ఓ గిరిజన యువతి పాత్ర కోసం నటి ఐశ్వర్య రాజేశ్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. వీటిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈమె తెలుగులో 'కౌసల్య కృష్ణమూర్తి', 'వరల్డ్ ఫేమస్ లవర్', 'మిస్ మ్యాచ్'లో నటించింది. ప్రస్తుతం నాని 'టక్ జగదీష్'లో ఓ కథానాయికగా చేస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: