దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్'లోని బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ లుక్ ఏప్రిల్ 2న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అక్టోబర్ 13న విడుదల కానుందీ సినిమా.
![azaydevagan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11209391_nbgh-1.jpg)
దర్శకుడు క్రిష్-హీరో పవన్‌కల్యాణ్ కాంబోలో 'హరిహర వీరమల్లు' సినిమా తెరకెక్కుతోంది. తాజాగా స్టంట్ కొరియోగ్రాఫర్ శ్యామ్ కౌశల్ అధ్వర్యంలో పవన్‌పై యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు ఓ ఫొటోను పోస్ట్ చేసింది చిత్రబృందం.
![pawan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11209391_nbgh-2.jpg)
![garjana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11209391_nbgh-3.jpg)
ఇదీ చూడండి: ఆర్ఆర్ఆర్-సీత పాత్రలో ఒదిగిపోయిన ఆలియా