దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ 'ఆర్ఆర్ఆర్'. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషనల్ సాంగ్ షూటింగ్లో బిజీగా ఉంది చిత్రబృందం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఆడియో రైట్స్‌ను సొంతం చేసుకున్నట్లు తెలిపాయి ప్రముఖ కంపెనీలు టీ-సిరీస్, లహరి మ్యూజిక్. హిందీతో పాటు దక్షిణాదికి చెందిన ఈ సినిమా ఆడియో హక్కుల్ని ఈ రెండు కంపెనీలు దక్కించుకున్నాయి. 'బాహుబలి' ఆడియో రైట్స్ కూడా వీరే సొంతం చేసుకున్నారు.
-
Glad to acquire the music rights of India’s Biggest Action Drama, @SSRajamouli’s most awaited @RRRMovie 🤩🔥🌊
— T-Series (@TSeries) July 26, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
An @MMKeeravaani Musical.
🎶 on @TSeries & @LahariMusic#RRRAudioOnTseriesLahari#BhushanKumar #TSeries @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @DVVMovies pic.twitter.com/3NPCvManpE
">Glad to acquire the music rights of India’s Biggest Action Drama, @SSRajamouli’s most awaited @RRRMovie 🤩🔥🌊
— T-Series (@TSeries) July 26, 2021
An @MMKeeravaani Musical.
🎶 on @TSeries & @LahariMusic#RRRAudioOnTseriesLahari#BhushanKumar #TSeries @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @DVVMovies pic.twitter.com/3NPCvManpEGlad to acquire the music rights of India’s Biggest Action Drama, @SSRajamouli’s most awaited @RRRMovie 🤩🔥🌊
— T-Series (@TSeries) July 26, 2021
An @MMKeeravaani Musical.
🎶 on @TSeries & @LahariMusic#RRRAudioOnTseriesLahari#BhushanKumar #TSeries @tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 @DVVMovies pic.twitter.com/3NPCvManpE
ఈ సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవల వచ్చిన 'రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్' పేరుతో వచ్చిన మేకింగ్ వీడియో అభిమానుల్ని అలరిస్తూ సినిమాపై అంచనాల్ని పెంచుతోంది. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషిస్తున్నారు.